ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 రోజులుగా వెయ్యిలోపే కేసులు

ABN, First Publish Date - 2020-12-01T08:43:40+05:30

విదేశాలతోపాటు, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ గడగడిలాడిస్తుంటే తెలంగాణలో మాత్రం కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గుముఖం పడుతుండడం ఊరట కలిగిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో కొత్తగా 593 పాజిటివ్‌లు.. మరో ముగ్గురు మృతి


హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): విదేశాలతోపాటు, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ గడగడిలాడిస్తుంటే తెలంగాణలో మాత్రం కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గుముఖం పడుతుండడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 10 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి రోజుకు వెయ్యిలోపే కేసులు నమోదవుతున్నాయి. నవంబరు 19న 1,058 పాజిటివ్‌లు రాగా, ఆ తర్వాత నుంచి వెయ్యిలోపే కేసులు వస్తున్నాయి. నిత్యం 40వేలకు తగ్గకుండా పరీక్షలు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఆ సంఖ్యను మరింత పెంచుతున్నారు. సాధారణంగా ఆదివారం చాలా తక్కు వ పరీక్షలు జరుగుతాయి. కానీ.. ఈ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 33,040 టెస్టులు నిర్వహించగా.. 593 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,69,816కు పెరిగింది. వైరస్‌ కారణంగా మరో ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 1,458కి చేరింది. అలాగే, వివిధ ఆస్పత్రుల నుంచి ఆదివారం 1058 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,022 యాక్టివ్‌ కేసులున్నాయి. 

Updated Date - 2020-12-01T08:43:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising