సమస్యలు పరిష్కరిస్తా.. ఫేస్‌బుక్ లైవ్‌లో ఎమ్మెల్యే హామీ
ABN, First Publish Date - 2020-04-25T23:47:13+05:30
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజా సమస్యల తెలుసుకోవడానికి ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఫేస్‌బుక్ లైవ్ లాంటి కార్యక్రమాల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాజా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫేస్‌బుక్ లైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, ప్రజలు, నాయకులు వారి ప్రాంతాల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Updated Date - 2020-04-25T23:47:13+05:30 IST