ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కువ చట్టాలు ఉంటే దేనికిందనైనా రిజిస్ట్రేషన్‌: హైకోర్టు

ABN, First Publish Date - 2020-08-13T08:01:19+05:30

ఒక వ్యవస్థలో సంస్థల రిజిస్ట్రేషన్‌కు ఒకటి కంటే ఎక్కువ చట్టాలున్నప్పుడు ఫలానా చట్టం కిందే రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక వ్యవస్థలో సంస్థల రిజిస్ట్రేషన్‌కు ఒకటి కంటే ఎక్కువ చట్టాలున్నప్పుడు ఫలానా చట్టం కిందే రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఆంక్షలు విధించజాలదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి ఆంక్షలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(సి), ఆర్టికల్‌ 43బీ, సహకార సంస్థల ప్రాథమిక నిబంధనలకు వ్యతిరేకమని తేల్చిచెప్పింది. తమ అవసరాలకు అనుగుణంగా దేనిలోనైనా సభ్యత్వం పొందే స్వేచ్ఛ సభ్యులకు ఉంటుందని తెలిపింది. తెలంగాణ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీల చట్టం కింద రిజిస్ట్రేషన్‌ చేయడానికి నిరాకరిస్తూ సహకార సంఘాల రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేసిన న్యాయమూర్తి వాటిని రద్దు చేశారు. సహకార సంఘాల కింద సంక్షేమ సంఘాన్ని రిజిస్టర్‌ చేయరాదంటూ ప్రైవేటు పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది. పిటిషనర్ల సంఘాన్ని కోర్టు ఆదేశాలు అందిన నెల రోజుల్లోగా రిజిస్టర్‌ చేయాలని రంగారెడ్డి జిల్లా సహకార అధికారి/రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. 

Updated Date - 2020-08-13T08:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising