ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెహదీపట్నంలో వోక్స్‌వ్యాగన్‌ కస్టమర్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-01T23:59:03+05:30

మెహదీపట్నంలో వోక్స్‌వ్యాగన్‌ కస్టమర్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్‌ ఇండియా నూతన కస్టమర్‌ టచ్‌ పాయింట్‌ను హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో వద్ద ప్రారంభించినట్లు వెల్లడించింది. జ్యోతినగర్‌లో 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన 3ఎస్‌ సదుపాయాలతో మోదీ ఆటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ నీహార్‌ మోదీ నాయకత్వంలో నిర్వహించబడుతుంది.


ఈ నూతన సదుపాయంలో 3 కార్లు డిస్‌ప్లే ఉండటంతో పాటుగా తాజా ఉత్పత్తి ఆఫరింగ్‌ను వినియోగదారులకు నూతన మరియు వినియోగించిన కార్ల విభాగం (డీడబ్ల్యుఏ)లో అందిస్తుంది. ఇది విస్తృతశ్రేణిలో అమ్మకం తరువాత సేవలను సైతం అందించడంతో పాటుగా నిర్వహణ మరియు విడిభాగాలను సైతం అందిస్తుంది. అలాగే అత్యంత నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల తోడ్పాటుతో వినియోగదారులకు సౌకర్యం అందిస్తూ మరమ్మత్తులను సైతం చేస్తుంది.


హైదరాబాద్‌లోని మెహదీపట్నం వద్ద నూతన సదుపాయాన్ని ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా కస్టమర్‌ టచ్‌ పాయింట్లను విస్తరించాలనే  సరైన దిశలో వోక్స్‌వ్యాగన్‌ వెళ్తుందని బ్రాండ్‌ హెడ్‌–వోక్స్‌ వ్యాగన్‌ పాసెంజర్‌ కార్స్‌ ఇండియా ప్రతినిధి అశీష్ గుప్తా పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని మా నెట్‌వర్క్‌కు వోక్స్‌వ్యాగన్‌ మెహదీపట్నం టచ్‌పాయింట్‌ జోడింపుతో మేము మా వినియోగదారులకు మరింత చేరువయ్యామని మోదీ ఆటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ నిహార్‌ మోదీ అన్నారు.  

Updated Date - 2020-12-01T23:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising