లక్నాపూర్ ప్రాజెక్టుకు జలకళ
ABN, First Publish Date - 2020-08-19T23:51:36+05:30
జిల్లాలోని పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడుతోంది. మూడేళ్ల తర్వాత పూర్తిగా నిండి నిండు కుండలా లక్నాపూర్ ప్రాజెక్టు మారింది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు
వికారాబాద్: జిల్లాలోని పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడుతోంది. మూడేళ్ల తర్వాత పూర్తిగా నిండి నిండు కుండలా లక్నాపూర్ ప్రాజెక్టు మారింది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు అలుగు పారడం మొదలైంది. 2 వందల ఎకరాల విస్తీర్ణంలో 0.3 టిఎంసి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా 2647 ఎకరాలకు సాగు అందుతోంది. లక్నాపూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాతాల ప్రజలు ప్రాజెక్టును చూసేందుకు బారులు తీరారు. ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం 6 కోట్ల 83 లక్షల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు సుందరీకరణ కోసం ఐదు ఎకరాల్లో పార్కు నిర్మాణం కోసం స్థలం సేకరించారు. మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తయితే వికారాబాద్ జిల్లాలో మరో విహార ప్రదేశంగా లఖ్నాపూర్ ప్రాజెక్టు మారనుంది.
Updated Date - 2020-08-19T23:51:36+05:30 IST