ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూఢచర్యం.. గుట్టురట్టు

ABN, First Publish Date - 2020-09-09T07:47:56+05:30

డిటెక్టివ్‌ ఉద్యోగం.. యువతులకు మాత్రమే..! అర్హతలు: చదువు పెద్దగా లేకున్నా.. అందంగా ఉండాలి. ‘అన్నింటికీ’ తెగించాలి. అర్ధరాత్రులు రమ్మన్నా రావాలి..! మగవారిని బుట్టలో పెట్టాలి. అర్ధరాత్రులు ఫోన్‌చేసి, వారి లొసుగులను గుర్తించాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అందమైన యువతులకు మాత్రమే ఉద్యోగాలు
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ స్టింగ్‌ ఆపరేషన్‌లో బట్టబయలు
  • అర్ధరాత్రిళ్లు మగవారితో మాట్లాడాలి
  • ఫోన్‌లో వారిని ట్రాప్‌లో పెట్టాలి
  • మాటలతోనే లొసుగులను గుర్తించాలి
  • ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సిందే
  • అన్నింటికీ తెగించేందుకు సిద్ధపడాలి
  • వెస్టర్న్‌ దుస్తులు మాత్రమే ధరించాలి
  • సినిమాల్లో కూడా అవకాశాలు?
  • డిటెక్టివ్‌ పేరుతో ‘దందా’ వెలుగులోకి
  • రంగంలోకి రాచకొండ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): డిటెక్టివ్‌ ఉద్యోగం.. యువతులకు మాత్రమే..! అర్హతలు: చదువు పెద్దగా లేకున్నా.. అందంగా ఉండాలి. ‘అన్నింటికీ’ తెగించాలి. అర్ధరాత్రులు రమ్మన్నా రావాలి..! మగవారిని బుట్టలో పెట్టాలి. అర్ధరాత్రులు ఫోన్‌చేసి, వారి లొసుగులను గుర్తించాలి. అంతా ‘బాగా’ చేస్తే.. సినిమాల్లో నటించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా యువతులనే టార్గెట్‌గా చేసుకుంటున్న ఓ ముఠా గుట్టును స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ రట్టు చేసింది.


సినిమా దందాపై దృష్టిపెడితే..

సినిమాల్లో అవకాశాలంటూ ఓ వ్యక్తి యువతులను ప్రలోభ పెడుతున్నట్లు ఉప్పందుకున్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ రంగంలోకి దిగింది. ఆడిషన్‌ ప్రదేశానికి వెళ్తే.. నిర్వాహకుడు తనను తాను ఓ ప్రముఖ దినపత్రికలో ఉన్నత హోదాలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. డీజీపీ మొదలు.. పోలీసు ఉన్నతాధికారులంతా తనకు క్లోజ్‌ అని.. మంత్రి కేటీఆర్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ అని చెప్పాడు. అతను చెప్పేవన్నీ 

అబద్ధాలేనని ప్రాథమిక అంచనాకు వచ్చిన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’.. అతని వెనక ఉన్నది రామకృష్ణ అనే వ్యక్తి అని గుర్తించింది. దీంతో.. స్టింగ్‌ ఆపరేషన్‌ను రామకృష్ణపై ఫోకస్‌ చేసింది. డిటెక్టివ్‌ ఏజెన్సీ పేరుతో రామకృష్ణ అమ్మాయిలను ట్రాప్‌ చేస్తున్నాడని తెలుసుకుంది.


1,800 కేసులను ఛేదించాడట..

రామకృష్ణపై నిఘా పెట్టిన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ అతడు అమ్మాయిలను ఏ విధంగా బుట్టలో వేసుకుంటాడు? నేరశైలి ఎలా ఉంటుంది? అనే విషయాలను రికార్డు చేసింది. ‘‘పోలీసుల వద్ద నాకు మంచి పలుకుబడి ఉంది. డబ్బులిస్తే ఏ పనైనా చేసిపెడతాను. నాకు మూడు డిటెక్టివ్‌ ఏజెన్సీలున్నాయి’’ అని చెప్పాడు. ఇద్దరు అమ్మాయిలు డిటెక్టివ్‌ జాబ్‌ కోసం వెళ్తే.. వారి ముందు గొప్పలు చెప్పుకొన్నాడు. డిటెక్టివ్‌ ఎలా ఉండాలి? నిఘా ఎలా పెట్టాలి? పాఠాలు బోధించాడు. ఈ వృత్తిలో నెలజీతం ఉండదని, పనిచేసిన రోజులకే డబ్బులు వస్తాయని చెప్పాడు. ‘‘రిస్క్‌ ఎంతో ఉంటుంది.. ఏదైనా జరిగితే బాధ్యత నాది కాదు. కానీ, నేను పెట్టిన టాస్క్‌ను పూర్తిచేయాల్సిందే’’ అంటూ షరతులు చెప్పాడు. ఆ సమయంలో.. ఓ వ్యక్తి తన భార్యతో సమస్య ఉందని చెబితే.. అంతా సీక్రెట్‌గా చేస్తానని, డబ్బులతోనే పనవుతుందని డీల్‌ మాట్లాడేశాడు. అదే సమయంలో.. అక్కడకు వచ్చిన బుజ్జి అనే వ్యక్తిని సినిమా డైరెక్టర్‌ అని ఆ ఇద్దరమ్మాయిలకు పరిచయం చేశాడు. ఆ అమ్మాయిలను బుజ్జికి చూపిస్తూ.. విధుల్లోకి చేరకున్నా.. ‘‘వాళ్లు నా అసిస్టెంట్లు. లేడీ డిటెక్టివ్‌లు’’ అని చెప్పాడు. తర్వాత వారి మాటలను బట్టి.. రామకృష్ణ, బుజ్జి ఒకే ముఠా అని ‘ఏబీఎన్‌’ అంచనాకు వచ్చింది. 


అర్ధరాత్రిళ్లూ రావాలి

లేడీ డిటెక్టివ్‌లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఆ ఇద్దరు యువతులను రామకృష్ణ ఓ ‘కాకా’హోటల్‌లో కలవమన్నాడు. అక్కడ వారితో.. ‘‘నాకు చదువుతో పెద్దగా పనిలేదు. అమ్మాయి అందంగా ఉంటే చాలు. అవసరమైతే విదేశాలకూ వెళ్లాలి. అక్కడి కరెన్సీ ప్రకారం రోజువారీ వేతనం ఉంటుంది. మీరు పోలీసులకు పట్టుబడితే (కారణం చెప్పలేదు. అంటే చట్టవ్యతిరేక పనిని పురమాయించే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది).. రిస్క్‌ మీదే. నేను జోక్యం చేసుకోను. ఆ విషయాన్ని డీల్‌ చేయడానికి వేరే వాళ్లుంటారు’’ అని చెప్పాడు. ఆ యువతులు చేయాల్సిన పని గురించి చెబుతూ ‘‘మీకో బేసిక్‌ ఫోన్‌ ఇస్తాను. అందులో సిమ్‌కార్డు నాదే. ఆ ఫోన్‌ను నాతో మాట్లాడేందుకు మాత్రమే వాడాలి. నేను చెప్పిన వారికి ఫోన్‌ చేయాలి. వారిని ట్రాప్‌ చేయాలి. అర్ధరాత్రుళ్లు ఫోన్లో మాట్లాడుతూ.. వారి లొసుగులను తెలుసుకోవాలి’’ అని వివరించాడు. తాను ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు రావాలని.. అర్ధరాత్రుళ్లు కూడా తనతో కలిసి పనిచేయాలని చెప్పాడు. గంటకోసారి లైవ్‌లొకేషన్‌ పంపాల్సి ఉంటుందన్నాడు. విధుల్లో ఉన్నప్పుడు చీర, పంజాబీ డ్రెస్‌ వంటివి కాకుండా.. వెస్టర్న్‌ దుస్తులే ధరించాలని ఆదేశించాడు.


చర్యలు తీసుకోవాలి

డిటెక్టివ్‌ ముసుగులో యువతులను పెడదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు ధరించే దుస్తులను నిర్దేశిస్తూ.. అర్ధరాత్రి కూడా రావాలనడం వెనక ఉద్దేశాన్ని పోలీసులు నిగ్గుతేల్చాలి. సినిమా ఆఫర్ల పేరుతో బరితెగించి పనిచేయాలనడం వెనక మతలబేంటో బయటపెట్టాలి. ఇదంతా ఆడపిల్లల జీవితాలతో ఆటలాడటమేనని తెలుస్తోంది.

- మట్టా జయంతి, బీసీ మహిళా సంఘం నాయకురాలు

Updated Date - 2020-09-09T07:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising