‘సార్’ వద్దు.. బ్రదర్ అనండి.. పవన్‌కల్యాణ్‌కు కేటీఆర్ ట్వీట్
ABN, First Publish Date - 2020-03-27T11:11:46+05:30
జనసేనాధిపతి, ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మధ్య గురువారం ట్విటర్‌లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. కరోనా నేపథ్యంలో తెలంగాణ
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జనసేనాధిపతి, ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మధ్య గురువారం ట్విటర్‌లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. కరోనా నేపథ్యంలో తెలంగాణ లాక్‌డౌన్‌ను పవన్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. అందులో కేటీఆర్‌ను ఉద్దేశించి ‘సార్’ అని సంబోధించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘‘థాంక్స్ అన్నా’’ అని బదులిస్తూ.. ‘‘మీరు నన్ను సార్ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? దయచేసి బ్రదర్ అనండి’’ అని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-03-27T11:11:46+05:30 IST