ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరిసిల్ల ఘటన దురదృష్టకరం

ABN, First Publish Date - 2020-02-21T08:30:29+05:30

సిరిసిల్ల బాలికల కళాశాల హాస్టల్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనపై ప్రభుత్వ పరంగా స్పందించామని, ఇలాంటివి జరిగినప్పుడు బాలికలు గొంతెత్తి చెప్పినప్పుడే దురాగతాలకు పాల్పడేవారు భయపడతారని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దురాగతాలపై బాలికలు గొంతెత్తాలి

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: కేటీఆర్‌

వచ్చే నెలలో సీఎం ఆకస్మిక తనిఖీలు

ప్రభుత్వపరంగా ఇప్పటికే చర్యలు చేపట్టాం

ఇలాంటి ఘటనలను అస్సలు ఉపేక్షించం


సిరిసిల్ల, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల బాలికల కళాశాల హాస్టల్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనపై ప్రభుత్వ పరంగా స్పందించామని, ఇలాంటివి జరిగినప్పుడు బాలికలు గొంతెత్తి చెప్పినప్పుడే దురాగతాలకు పాల్పడేవారు భయపడతారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలోని ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్‌ను గురువారం ఆయన సందర్శించారు. లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి.. వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో కేటీఆర్‌ మాట్లాడుతూ హాస్టల్‌లో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటనపై ప్రభుత్వం పరంగా వెంటనే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిందితుడు దేవయ్య తమ పార్టీ నాయకుడేనని తెలియడంతో వెంటనే సస్పెండ్‌ చేసి, అరెస్ట్‌ చేశామని గుర్తు చేశారు. మానసికంగా కుంగిపోయిన విద్యార్థినులకు అధికార యంత్రాంగం ధైర్యం చెప్పి.. అండగా నిలిచిందన్నారు. జిల్లాలో ఎక్కడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. ఆత్మరక్షణ నిమిత్తం బాలికలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హాస్టల్‌కు పక్కా భవనం కావాలని విద్యార్థులు అడిగారని, త్వరలోనే నిర్మిస్తామన్నారు. సభ్యసమాజంలో ఇలాంటి ఘటనలను ఎవరూ ఆమోదించరని, పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. కాగా, సిరిసిల్ల బాలికల కళాశాల హాస్టల్‌లో జరిగిన ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల బాలికల హాస్టల్‌ను సందర్శించిన తర్వాత ఆయన మాట్లాడుతూ హాస్టల్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. హాస్టల్‌లో భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-02-21T08:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising