ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-06T22:13:06+05:30

మంత్రి కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చి 24 గంటలు గడిచినా.. టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చి 24 గంటలు గడిచినా.. టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించారని ఆరోపించారు. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చారని, తన భవనానికి విశాలమైన రోడ్డు వేసుకున్నారని తెలిపారు. కేటీఆర్‌ 111 జీవోను ఉల్లంఘించడంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెళ్లామని చెప్పారు. 8 మంది అధికారులతో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసిందని తెలిపారు. 301, 302 సర్వే నెంబర్లలో కేటీఆర్ సతీమణికి భూమి ఉందని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఇస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అర్బణా వెంచర్స్‌కు కూడా అక్కడ భూమి ఉందని, అందులో కేటీఆర్‌కు వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఉందని తెలిపారు. ఆ భూములు లీజుకు తీసుకుంటే అఫిడవిట్‌లో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. ఎవరి దగ్గర లీజుకు తీసుకున్నారో, దాని యజమాని ఎవరో బయట పెట్టాలని, అక్కడ వారి భూములున్నట్లు తాను నిరూపిస్తానని, లేదంటే ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Updated Date - 2020-06-06T22:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising