ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులను సమీక్షించిన కేటీఆర్‌

ABN, First Publish Date - 2020-06-05T01:07:46+05:30

ఖమ్మం మున్సిపాలిటీల పరిధలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురపాలక, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు గురువారం మాసాబ్‌టాంక్‌లోని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఖమ్మం మున్సిపాలిటీల పరిధలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురపాలక, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు గురువారం మాసాబ్‌టాంక్‌లోని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా పలు అంవాలపై చర్చించారు. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నగరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యల్ని నివేదిక ద్వారా మంత్రి కేటీఆర్‌కు మంత్రి పువ్డాడ వివరించారు. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న మిషన్‌ భగీరధ పనుల వివరాలు చర్చకు వచ్చాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. రాబోతున్న వర్షాకాలంలో సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కూడా ఈసమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, మున్సిపల్‌కమిషనర్‌ అనురాగ్‌ జయంతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T01:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising