ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద సహాయక చర్యలపై అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం

ABN, First Publish Date - 2020-10-18T17:00:57+05:30

రద ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సహాయక చర్యలను జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది. కాలనీలు, సెల్లార్లలో నిలిచిన నీటిని పంపులతో డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు పంపింగ్ చేస్తున్నారు. అంతేకాదు రోడ్లపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సహాయక చర్యలను జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది. కాలనీలు, సెల్లార్లలో నిలిచిన నీటిని పంపులతో డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు పంపింగ్ చేస్తున్నారు. అంతేకాదు రోడ్లపై నిలిచిన నీటిని  జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తోంది. వరదతో రోడ్లు, నాలాల్లోకి కొట్టుకొచ్చిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. శనివారం రాత్రి రికార్డు స్థాయిలో కురిసిన వాన పలు ప్రాంతాల్లో నగరవాసులకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన కొందరు విగత జీవులుగా మారగా.. చెరువుల్లా మారిన నివాసాలతో పలు కాలనీలు, బస్తీల్లో ప్రజలు కట్టుబట్టలతో బయటకు వచ్చారు. సకాలంలో సహాయక చర్యలు అందించడంతోజీహెచ్‌ఎంసీ విఫలమైందని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-10-18T17:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising