ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయకపోతే ఊరూరా ఉద్యమం: కోదండరాం

ABN, First Publish Date - 2020-12-10T10:25:32+05:30

ఎల్‌ఆర్‌ఎ్‌సను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి రిజిస్ర్టేషన్లను ప్రారంభించకపోతే ఊరూరా ఉద్యమం ఉప్పెనైలేస్తుందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌కు తన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిజిస్ర్టేషన్లు ప్రారంభించాలి: మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌


కవాడిగూడ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎ్‌సను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి రిజిస్ర్టేషన్లను ప్రారంభించకపోతే ఊరూరా ఉద్యమం ఉప్పెనైలేస్తుందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌కు తన ఫామ్‌హౌ్‌సపై ఎంత హక్కు ఉందో రాష్ట్ర ప్రజలకూ వారి సొంత ఆస్తులపై అంతే హక్కు ఉంటుందన్నారు. రాష్ట్రంలో రిజిస్ర్టేషన్లు వెంటనే ప్రారంభించడంతోపాటు ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రియల్టర్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ డాక్యుమెంట్‌, రైటర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద బుధవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌  కె నాగేశ్వర్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ హాజరై మద్దతు తెలిపారు. భూ అక్రమణల్లో ప్రగతి భవన్‌ వరకు లింకు ఉందని  కోదండరాం ఆరోపించారు. రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని, ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పోర్టల్‌ను తక్షణమే రద్దు చేయాలని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-12-10T10:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising