ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతలపై పోలీసులతో దాడులా?

ABN, First Publish Date - 2020-10-27T09:12:54+05:30

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: కిషన్‌ రెడ్డి 


సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 26: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నాయకులపై పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం దాడి చేయిస్తోందని, ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం సిద్దిపేటలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బందువుల ఇంట్లో సోదాలు జరగడంతో సిద్దిపేటకు కిషన్‌ రెడ్డి వచ్చారు. సోదాలు జరిగిన క్రమాన్ని ఆయనకు రఘునందన్‌ వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అభ్యర్థికి ప్రచారం చేసుకునే హక్కును భారత రాజ్యంగం కల్పించిందని, అలాంటిది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంతలా వేధించడం సరైందికాదన్నారు. టీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.  

Updated Date - 2020-10-27T09:12:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising