ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి: రాజగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-12-29T22:26:21+05:30

కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్‌లో కిష్టరాంపల్లి భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ : కలెక్టరేట్‌‌లోని ఉదయాదిత్య భవన్‌లో భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో గత ఆరేళ్లుగా  రైతులు తమ బాధలు చెబుతూనే ఉన్నారన్నారు. కాంట్రాక్టర్లకు మద్దతుగా పోలీసులను పెట్టి పనిచేయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కాళేశ్వరానికి ఓ న్యాయం, తమ ప్రాంత ప్రాజెక్టులకు ఓ న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం నిరాహారదీక్ష చేసైనా సరే సీఎం కళ్లు తెరిపిస్తామని ఆయన ప్రకటించారు. ప్రాజెక్టు విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తే ప్రజలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-12-29T22:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising