ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజీ చికెన్, మటన్ ధర ఎంతో తెలుసా..!

ABN, First Publish Date - 2020-03-29T16:43:47+05:30

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో చికెన్, మటన్, గుడ్ల రేట్లు ఊహించని రీతిలో పడిపోయాయి. మొన్నటివరకు కొనేవారు లేక చికెన్, మటన్‌ షాపులు దివాళా తీశాయి. ఇందుకు కారణం.. చికెన్, మటన్ తింటే కరోనా వస్తుందనే ఒక అపోహే. ఇదంతా రెండ్రోజుల క్రితం పరిస్థితి. చికెన్ వల్ల కరోనా రాదని.. సాక్ష్యాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా మీట్‌లో స్పష్టం చేశారు. దీంతో నిన్న, ఇవాళ చికెన్, మటన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మాంసం షాపుల దగ్గర రద్దీ నెలకొంది. షాపుల దగ్గర జనాలు బారులు తీరారు.


ప్రస్తుతం కేజీ చికెన్ రూ.180 ఉండగా.. కేజీ మటన్‌ రూ.800గా ఉంది. అయినప్పటికీ జనాలు మాత్రం చికెన్ షాపులకు క్యూ కట్టారు. మరోవైపు మటన్ షాపుల దగ్గర కూడా ఇదే పరిస్థితి. అయితే.. షాపుల దగ్గర సామాజిక దూరం పాటించకుండా ప్రజలు ఎగబడుతున్నారు. సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, సెలబ్రిటీలు పదే పదే మొత్తుకుంటున్నప్పటికీ జనాలు మాత్రం కొన్ని చోట్ల అస్సలు పట్టించుకోవట్లేదు.

Updated Date - 2020-03-29T16:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising