ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా ఉంటాం : మంత్రి
ABN, First Publish Date - 2020-09-14T10:19:11+05:30
ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా ఉంటామని, ప్రస్తుత కొవిడ్ భయానక సమయంలో వారికి
ఖమ్మంటౌన్, సెప్టెంబర్ 13: ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ప్రైవేట్ ఉపాధ్యాయులకు అండగా ఉంటామని, ప్రస్తుత కొవిడ్ భయానక సమయంలో వారికి నిత్యావసరాలు అందించటం అభినందనీయమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం, తనికెళ్లలోని గ్రేస్ కళాశాల ఆధ్వర్యంలో 300మంది ప్రయివేట్ ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు.
నగరంలోని వాసవి కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి నిత్యావసరాలు అందజేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యారంగంపై కొవిడ్ ప్రభావం తీవ్రంగా పడిందని, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల వల్ల విద్యారంగం కోలుకొనే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు పువ్వాడ ఫౌండేషన్ వారికి అండగా ఉంటుందని, త్వరలోనే నిత్యావసరాలను అందిస్తామని, ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాల్లో ఎవరైనా కరోనా బారిన పడితే మమత ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రేస్ సంస్థల చైర్మన్ జాకబ్, ప్రిన్సిపాల్ శ్రీవేణు, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు రాంచందర్‌రావు, బి.రాంమోహన్‌రావు, మేయర్ పాపాలాల్ పాల్గొన్నారు.
Updated Date - 2020-09-14T10:19:11+05:30 IST