ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29నుంచి వైరాలో చేపల వేట

ABN, First Publish Date - 2020-05-27T10:09:55+05:30

ఈనెల 29నుంచి వైరా రిజర్వాయర్‌లో చేపల వేట మొదలవుతుందని వైరా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి జనగామ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, మే 26: ఈనెల 29నుంచి వైరా రిజర్వాయర్‌లో చేపల వేట మొదలవుతుందని వైరా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి జనగామ శివప్రసాద్‌ ప్రకటించారు. మంగళవారం చేపల వేట వివరాలను వెల్లడించారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యులంతా నిబంధనలకు లోబడి చేపల వేట కొనసాగించాలని స్పష్టం చేశారు. 29వతేదీ తెల్లవారుజాము నుంచి వచ్చేనెల 30వతేదీ వరకు మాత్రమే ఈ చేపల వేటకు అనుమతిస్తున్నామని స్పష్టం చేశారు. చేపల వేట చేసే సభ్యులు విధిగా పాటించాల్సిన నిబంధనలు వివరించారు. 


మత్స్యపారిశ్రామిక సహకార సంఘం(వైరా)కు చెందిన సభ్యులు మాత్రమే రిజర్వాయర్‌లో చేపల వేట చేయాలి. సభ్యుడు కాని వేరేవారు ఎవరైనా చేపల వేటలో పాల్గొన్నట్లు గుర్తించినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.


వైరా రిజర్వాయర్‌ వైరా, కొణిజర్ల, తల్లాడ మండలాల పరిధిలో ఉన్నందున చేపల వేట స మయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు కోరుతూ మూడు పోలీ్‌సస్టేషన్లకు లేఖ లు రాశారు. అలాగే మూడు మండలాల ప్రాథమిక కేంద్రాల డాక్టర్లకు కూడా అవసరమైన వైద్యసహాయాన్ని అందించాలని కోరుతూ సమాచారం ఇచ్చారు.

Updated Date - 2020-05-27T10:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising