అ‘ధర’గొడుతున్నారు!
ABN, First Publish Date - 2020-03-27T12:02:27+05:30
ఎద్దుపుండు కాకికి ముద్దు అన్న సామెత చందంగా ఉంది ఖమ్మంలో వ్యాపారుల తీరు. లాక్‌డౌన్ నేపథ్యంలో
కూరగాయల కేంద్రాల్లో వ్యాపారుల ఇష్టారాజ్యం
ధరలు పెంచి విక్రయం.. వినియోగదారుల బెంబేలు
ప్రభావం చూపని ప్రజాప్రతినిధులు, అధికారుల హెచ్చరికలు
ఖమ్మం మార్కెట్, మార్చి 26: ఎద్దుపుండు కాకికి ముద్దు అన్న సామెత చందంగా ఉంది ఖమ్మంలో వ్యాపారుల తీరు. లాక్‌డౌన్ నేపథ్యంలో వినియోగదారుల అవసరాన్ని ఆసరగా చేసుకుని దోపిడీకి తెరదీశా రు. మొన్నానిన్నటి దాకా పట్టుమని పది రూపాయలు కూడా పలకని కిలో టమాట దరను ఏకంగా రూ.20 చేశారు. వంకాయ, బెండ, పచ్చిమిర్చి ధరలను అమాంతం పెంచారు. విక్రయ కేంద్రాల్లో కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం వ్యాపారుల ‘ధరా’ఘాతాన్ని సూచిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన హెచ్చరికలు ఫలితమివకపోవడంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది.
రాష్ట్రవ్యా ప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూరగాయల కేంద్రాల్లో వినియోగదారులు దోపిడీకి గురువుతున్నారు. లాక్‌డౌన్‌ను తమకు అనుకూలంగా మలచుకొని అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ధరల నియంత్రణలో అధికారులు ఏమా త్రం దృష్టి సారించకపొవడంతో మార్కెట్‌లో దోపిడీకి తెరలేచింది. ఐదు రోజులుగా జరుగుతున్న జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ల వల్ల ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు.
వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా వారు పట్టించుకోవడం లేదు. రైతు బజార్‌లలో రద్దీ నియంత్రణకు జిల్లా అధికారులు నగరవ్యాప్తంగా పలు డివిజన్‌లలో గురువారం 26 కేంద్రాలలో ప్రత్యేక రైతుబజార్లను ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా.. అధికారు లు ధరల పట్టికలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారులు దోపిడీకి తెరలేపారు. కేజీ టమాటా రూ.20 వంకాయ రూ.30, బెండకాయ రూ.40, పచ్చిమిర్చీ రూ.40, కాకరకాయ రూ.40, బీరకాయ రూ.40, కొత్తిమీర కట్టను రూ.20, దొండకాయలు రూ.40కు వి క్రయించారు. నగరంలోని మూడు ప్రభుత్వ రైతుబజార్లను, రాపర్తినగర్‌లోని ప్రధాన కూ రగాయల మార్కెట్‌లో రద్దీ ఎక్కువగా ఉం టుందన్న ఉద్దేశ్యంతో అక్కడ కొనుగోళ్లను ని లిపివేశారు.
మూడు రోజుల క్రితం భక్తరామదాసు కళాక్షేత్రం వద్ద ఉన్న రైతుబజార్‌లో ర ద్దీ పెరుగుతోందనే ఉద్దేశ్యంతో కొనుగోళ్లను పక్కనే ఉన్న పెవిలీయన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. గురువారం అక్కడ అమ్మకాలు నిలిపివేయడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యేక కూరగాయల కేం ద్రాలు కొన్ని డివిజన్లలో ఏర్పాటు చేయక పోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
Updated Date - 2020-03-27T12:02:27+05:30 IST