ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు

ABN, First Publish Date - 2020-12-11T04:53:42+05:30

వన్యప్రాణి సంరక్షణకు చర్యలు తీసుకుంటు న్నామని అటవీ శాఖాధికారులు తెలిపారు.

చెరువును పరిశీలిస్తున్న అటవీశాఖ ఉన్నత అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రుగొండ, డిసెంబరు 10: వన్యప్రాణి సంరక్షణకు చర్యలు తీసుకుంటు న్నామని అటవీ  శాఖాధికారులు తెలిపారు. గురువారం చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని కనిగిరి గుట్టలను కొత్తగూడెం జిల్లా సీసీఎఫ్‌ పివీ రాజారావు, జిల్లా అటవీ శాఖ అధికారి లక్ష్మణ్‌రంజీత్‌నాయక్‌, ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి ఎ.అప్పయ్య పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది అటవీ ప్రాంతంలో నిర్మించిన చెరువును ప్రతాపరుద్రగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. కనిగిరి గుట్టల్లో కాకతీయుల నాటి కట్టడాలు వాటి ఆనవాళ్లు ప్రస్తుతానికి చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. నూతనంగా నిర్మించిన ప్రతాపరుద్ర చెరువు హస్తాల వీరన్న గుడికి తూర్పు భాగాన 500 మీటర్ల దూరంలో ఉందన్నారు. దీని పక్కన 20 హెక్టార్‌లలో మైదానం, వాచ్‌ టవర్‌ను నిర్మిస్తామన్నారు. అడవిలో అవసరం, అవకాశం ఉన్నం త వరకు జంతువులు, పక్షుల కోసం నీటి గుంటలు, చెరువులను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చంద్రుగొండ ఫారెస్ట్‌ రేంజర్‌ సీహెచ్‌.శ్రీనివాసరావు, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారులు రాములు, రామారావు, నాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T04:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising