షార్ట్ సర్క్యూట్‌తో వ్యాక్సిన్ ఫ్రీజర్ ధ్వంసం
ABN, First Publish Date - 2020-06-01T11:05:29+05:30
షార్ట్ సర్క్యూట్‌తో వ్యాక్సిన్ ఫ్రీజర్ ధ్వంసమైన సంఘటన కొత్తగూడెం పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, మే 31: షార్ట్ సర్క్యూట్‌తో వ్యాక్సిన్ ఫ్రీజర్ ధ్వంసమైన సంఘటన కొత్తగూడెం పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పట్టణంలోని సఫాయి బస్తీలోగల ప్రాథమిక ఉప కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో వ్యాక్సిన్‌లను భద్రపర్చే ఫ్రీజర్ పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం అగ్నిమాపక కేంద్రం అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, స్థానికుల సహాయంతో పెను ప్రమాదం సంభవించకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ఈ సంఘటనలో కొత్తగూడెం ఫైర్ స్టేషన్ ఆఫీసర్ క్రాంతి, ఎల్‌ఎఫ్ నానయ్య, ఫైర్‌మెన్ రాజు, హోంగార్డు ప్రతాప్, శ్రీను, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-01T11:05:29+05:30 IST