ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగని దందా

ABN, First Publish Date - 2020-05-25T09:28:59+05:30

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమంగా రవాణా జరగుతూనే ఉంది. తెలంగాణలో ఏపీకంటే మద్యం ధరలు తక్కువగా ఉండడంతో పాటు కావాల్సిన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ నుంచి ఏపీకి యథేచ్చగా మద్యం రవాణా

వ్యవసాయ క్షేత్రాలనుంచి ఆంధ్రాకు తరలింపు 

సీసాల లేబుల్స్‌, సీళ్లు తొలగించి అక్రమ రవాణా


సత్తుపల్లి, మే 24: తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమంగా రవాణా జరగుతూనే ఉంది. తెలంగాణలో ఏపీకంటే మద్యం ధరలు తక్కువగా ఉండడంతో పాటు కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో ఉండడంతో తెలంగాణకు చెందిన కొందరు మద్యం వ్యాపారులు ఆంధ్రాకు భారీగా మద్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను బలపరుస్తూ ప్రతిరోజు ఏపీ ఎక్సైజ్‌, పోలీసు అధికారులు ఎక్కడో ఒకచోట తెలంగాణ మద్యాన్ని  స్వాధీనం చేసుకుంటున్నారు. 


సరిహద్దు మండలాల నుంచే.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ, ఆంరఽధప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న మండలాల నుంచి పెద్ద మొత్తంలో మద్యం అక్రమంగా రవాణ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకూ బైక్‌లపైనే ఈ రవాణా చేయగా తాజాగా పెద్ద వాహనాల్లో చెక్‌పోస్టులను తప్పించుకుంటూ వ్యవసాయ క్షేత్రాల గుండా ఏపీకి తరలిస్తున్నట్లు సవచాఆరం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మీదుగా జంగారెడ్డిగూడెం, భీమవరం వరకూ, చింతలపూడి, కృష్ణా జిల్లాలోని సరిహద్దు మండలాలకు మద్యం భారీగా తరలిస్తున్నారు.


తాజాగా.. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం-పశ్చిమగోదావరి జిల్లా గురుభట్లగూడెం రోడ్డులో ఉన్న ఒక పామాయిల్‌ తోటలోకి శనివారం రాత్రి ఒక డీసీఎం వ్యాన్‌లో తెలంగాణాకు చెందిన మద్యాన్ని పెద్ద మొత్తంలో తరలించినట్లు సమాచారం. పామాయిల్‌ తోటలో మద్యం అన్‌లోడ్‌ చేసి అక్కడ సీసాలకు ఉన్న లేబుళ్లను తొలగించి ఆంధ్రాకు గుట్టుచప్పుడుకాకుండా తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఆయా బాటిళ్ల అట్టపెట్టెలను ఈ పామాయిల్‌ తోటలో తగులబెట్టిన అక్రమార్కులు కొన్ని మద్యం అట్టపెట్టెలు, సీళ్లను అక్కడే వదిలేసి వెళ్లటంతో ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  


విఫలమైన నిఘావిభాగం 

మద్యం అక్రమ రవాణను అరికట్టాల్సిన సరిహద్దు అధికార యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి నుంచి అక్రమంగా తరలుతున్న మద్యం ఆంధ్రాలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో పట్టుబడుతోంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కడా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ విషయం పలు అనుమానాలకు తావిస్తోంది. 

Updated Date - 2020-05-25T09:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising