నేడు ఇద్దరు మంత్రుల పర్యటన
ABN, First Publish Date - 2020-11-13T09:37:35+05:30
రైతువేదికల ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో
రైతువేదికలను ప్రారంభించనున్న నిరంజన్‌రెడ్డి, అజయ్
ఖమ్మం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రైతువేదికల ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రఘునాథపాలెంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన సోదరుడు పువ్వాడ ఉదయ్‌కుమార్ జ్ఞాపకార్థం సొంత నిధులు రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన రైతువేదికను మంత్రి నిరంజన్‌రెడ్డి ఉదయం 10గంటలకు ప్రారంభిస్తారు. తలపాగా చుట్టుకున్న రైతులా ముఖ్యమంత్రి కేసీఆర్ త్రీడీ భారీ చిత్రాన్ని ఈ రైతు వేదిక గోడపై వేయగా.. అది విశేషంగా ఆకట్టుకుంటోంది.
అనంతరం 11:40గంటలకు రఘునాథపాలెం, జింకలతండా రోడ్డుకు, మార్కెటింగ్ గోడౌన్‌కు, 11:50కి రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ టెస్టింగ్ ల్యాబ్, గోడౌన్‌కు మంత్రులు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత వి.వెంకటాయపాలెం, తనికెళ్ల, బోనకల్ మండలం ముష్టికుంట్లలో నిర్మించిన రైతువేదికలను ప్రారంభించనున్నారు. అనంతరం ఖమ్మం ఎన్నెస్పీ విశ్రాంతి గృహానికి చేరుకుని భోజనం చేసి తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు. అయితే మంత్రుల పర్యటన కోసం ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Updated Date - 2020-11-13T09:37:35+05:30 IST