పులి కోసం ముమ్మరంగా గాలింపు
ABN, First Publish Date - 2020-12-02T05:19:33+05:30
నాలుగు రోజులుగా మండలంలో సంచరిస్తున్న పులి కోసం అ టవీఅధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
అశ్వాపురం డిసెంబరు 1: నాలుగు రోజులుగా మండలంలో సంచరిస్తున్న పులి కోసం అ టవీఅధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొదటగా రామచంద్రాపురం అటవీప్రాతంలో సంచరించిన పులి అటు తర్వాత తుమ్మలచెరువు గుట్టకు చేరినట్లు అధికారులు, స్థానికులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తుమ్మలచెరువు గు ట్ట సమీపంలో ఉన్న సాయిబులగుంపునకు చెందిన ఒక వ్యక్తికి పులి కన్పించిందన్న సమాచారంతో మంగళవారం అశ్వాపురం ఫారెస్ట్ రేంజర్ జి.ప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్థులకు పలు సూచనలు చేశారు. పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లొదంటూ గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పత్తిచేలకు వెళ్లే కూలీలకు అవగాహన కల్పించారు.
Updated Date - 2020-12-02T05:19:33+05:30 IST