ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం

ABN, First Publish Date - 2020-07-02T10:35:24+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం/ఖమ్మం, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్‌లోని మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, భద్రాచలం డివిజన్‌లోని భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, సారపాక, బూర్గంపాడు, పాల్వంచ ములకలపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, ఆళ్లపల్లి గుండాల, సుజాతనగర్‌, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, జూలూరుపాడు, చంద్రుగొండ, అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట తదితర మండలాల్లో వర్షం ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కొత్తగూడెంలో రైల్వే అండర్‌ బ్రిడ్జికి నీరు చేరుకొని రాకపోకలకు అంతరాయం కలిగింది. పినపాక, కరకగూడెం, మణుగూరులో కూడా భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో సింగరేణి బొగ్గు బావుల్లో అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు బావుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయమేర్పడింది. గుండాల, ఇల్లెందులో భారీగా వర్షం కురవడం వల్ల కిన్నెరసాని ప్రాజెక్ట్‌కు కూడా నీరు చేరింది. ఖమ్మం జిల్లాలోనూ పలుచోట్ల సాయంత్రం వేళ ముసురు కమ్ముకుంది.

Updated Date - 2020-07-02T10:35:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising