ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంటలు వేయాలి

ABN, First Publish Date - 2020-05-23T10:08:02+05:30

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంటలు వేయాలని ఆత్మ పీడీ ఎం.విజయనిర్మల కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మంవ్యవసాయం, మే22: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంటలు వేయాలని ఆత్మ పీడీ ఎం.విజయనిర్మల కోరారు. శుక్రవారం జిల్లా రైతు శిక్షణా కేంద్రం సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వరిలో సన్నరకం వంగడాలను వేస్తే రైతులకు అధిక దిగుబడి వస్తుందన్నారు. పంటమార్పిడి వల్ల భూసారం దెబ్బతినదని, పీడీ పేర్కొన్నారు. పప్పు ధాన్యల సాగు, నూనెగింజల ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.


అనంతరం జిల్లా ఆత్మ గవర్నింగ్‌ బోర్డు సభ్యులను ఎన్నుకొన్నారు. సభ్యులుగా నెల్లూరి శేషగిరి, గోళ్ల సావిత్రమ్మ, వినుకొండ వెంకటరాములు, కర్నాటి నాగమణి, బి.ఖతర్‌, అజ్మీర సుశీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసమావేశంలో ఆత్మ డిప్యూటీ పీడీ ఎం.సతీష్‌ 2020-21 కు సంబంధించిన వార్షిక ప్రణాళికను ఆత్మ చేపట్టిన వివిధ కార్యకలాపాలను వివరించారు. ఈసమావేశంలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్‌ కె.రవి, జిల్లా రైతు సలహా సంఘం సభ్యులు రంగిశెట్టి కోటేశ్వరరావు, బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్‌, బానోతు దేవేందర్‌, పెద్దపాక సుజాత, ఆర్‌.బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T10:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising