ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ ఆరాచక పాలనకు చేక్‌పేట్టే సత్తా బీజేపీకే ఉంది

ABN, First Publish Date - 2020-10-19T09:58:02+05:30

టీఆర్‌ఎస్‌ పాలనకు చెక్‌ పెడతామని, రాబోయే రోజులన్నీ బీజేపీవేనని ఆ పార్టీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అద్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి, జిల్లా అద్యక్షుడు గల్లా


ఖమ్మం మయూరిసెంటర్‌, అక్టోబరు 18: టీఆర్‌ఎస్‌ పాలనకు చెక్‌ పెడతామని, రాబోయే రోజులన్నీ బీజేపీవేనని ఆ పార్టీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని తొమ్మిదో డివిజన్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేత కుమిలి శ్రీనివాస్‌ తన అనుచరులతో బీజేపీలో చేరారు. అయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం నగర అద్యక్షుడు రుద్ర ప్రదీప్‌ అధ్యక్షతన జరిగిన సభలో కొండపల్లి, గల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అరాచక పాలన నడుస్తున్నదని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కి నియంతృత్వ పాలన సాగిస్తున్నారన్నారు. ఉద్యమాన్ని అవమాన పరిచిన వారు మంత్రులు అయ్యారని, వారు సమాజాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించలేక చతికిల పడుతోందని, ప్రజాప్రతినిధులను కాపాడుకోలేక టీఆర్‌ఎ్‌సకు బీ టీం గా మారిందన్నారు.


వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని, అన్ని డివిజన్‌లలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దొంగల సత్యనారాయణ, కనమర్తపుడి ఉపేందర్‌, వేల్పుల సుధాకర్‌, ఉపేందర్‌ గౌడ్‌, చంద్రశేఖర్‌ గౌడ్‌, కిరణ్‌, మురళి, భద్రం పాల్గొన్నారు. పార్టీలో చేరి న వారిలో సురే్‌షబాబు, రఘువర్మ, మధుసుదన్‌, హరీష్‌, వీరన్న, రామారావు, వెంకట్‌, రమే్‌షరెడ్డి, పండు, సతీష్‌ యాసీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T09:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising