వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-12-30T04:51:54+05:30
భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ఎర్రుపాలెం, డిసెంబరు 29: భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం...చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన బొగ్గుల చిన్నప్పరెడ్డి కుమార్తె వేమిరెడ్డి కోటేశ్వరి(32)ను లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేమిరెడ్డి నాగిరెడ్డితో పదేళ్ల క్రితం వివాహమైంది. కొంత కట్నకానుకలు ఇచ్చి వివాహం జరిపారు. అదనపు కట్నం కోసం భర్త నాగిరెడ్డితోపాటు అత్తమామలు పార్వతి, వెంకటేశ్వర్‌రెడ్డి కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో సోమవారం పొలానికి వెళ్లిన కోటేశ్వరి అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పొలానికి వెళ్లిన కోటేశ్వరి ఇంటికి రాకపోవడంతో అక్కడకు వెళ్లి చూడగా సోమవారం రాత్రి మృతిచెంది ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్ సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మంగళవారం కోటేశ్వరి తండ్రి చిన్నప్పరెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఒక కుమారుడు ఉన్నారు.
Updated Date - 2020-12-30T04:51:54+05:30 IST