ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్టీ కట్టరు.. ట్రేడ్‌లైసెన్స్‌ ఉండదు!

ABN, First Publish Date - 2020-12-29T04:01:18+05:30

సెకండ్‌ హ్యాండ్‌ ద్విచక్ర వాహనాల వ్యాపారం సత్తుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది కన్సల్టెన్సీ బోర్డులు ఏర్పాటు చేసుకొని షాపుల్లో పెద్ద సంఖ్యలో మోటార్‌సైకిళ్లు కొనుగోలు చేసి తెచ్చి వ్యాపారం సాగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సత్తుపల్లిలో ఇష్టారాజ్యంగా  సెకండ్‌ హ్యాండ్‌ ద్విచక్ర వాహనాల వ్యాపారం

 రిజిస్ర్టేషన్లు లేకుండానే విక్రయాలు 

వాహన కొనుగోలుదారులను నెలలు తరబడి తిప్పించుకుంటున్న వైనం

 పట్టించుకోని అధికారులు

సత్తుపల్లి, డిసెంబరు28: సెకండ్‌ హ్యాండ్‌ ద్విచక్ర వాహనాల వ్యాపారం సత్తుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది కన్సల్టెన్సీ బోర్డులు ఏర్పాటు చేసుకొని షాపుల్లో పెద్ద సంఖ్యలో మోటార్‌సైకిళ్లు కొనుగోలు చేసి తెచ్చి వ్యాపారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలు అమ్మిన వారికి కొందరు కన్సల్టెన్సీల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు పలువురి అండదండలున్నాయని చెప్పుకుంటున్న కొందరు వ్యాపారులు.. అక్రమ పద్దతుల్లో తమ వ్యాపారాన్ని యథ్ఛేగా నిర్వహిస్తున్నారుని పలువురు చెబుతున్నారు. కన్సల్టెన్సీ ద్వారా రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నా కొందరికి కనీసం ట్రేడ్‌ లైసెన్స్‌ కూడా లేదని అంటున్నారు. సాలీనా లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తున్నా కొందరు కనీసం జీఎస్టీ రిటర్న్సు కూడా ఇవ్వటం లేదని, అసలు జీఎస్టీ నెంబరు కూడా వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యాపారి ఇటీవల హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో సెకండ్‌ హ్యాండ్‌ మోటార్‌ సైకిళ్లు కొనుగోలు చేశాడు. సత్తుపల్లికి రవాణా చేస్తూండగా కనీసం వేబిల్లు కూడా లేకపోవటంతో అధికారులు పట్టుకున్నారు. ఆ తరువాత పైరవీలతో వాటిని విడిపించుకున్నట్లు ప్రచాచం జరిగింది.   సరైన అనుమతులు లేకుండా సాగుతున్న వ్యాపారంలో చోరీకి గురైన వాహనాలు వస్తే పరిస్థితి ఏమిటనే ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 ఆంధ్రా నుంచి వచ్చి కొనుగోళ్లు

కొందరు ద్విచక్ర వాహనాల వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి వాహనాలు కొనుగోలు చేస్తున్నారని, వీటిని తిరిగి ఈ ప్రాంతంలోనే లాభాలకు విక్రయించి వెళుతున్నారని అంటున్నారు. వీరికి కనీసం ఒక అడ్రస్‌ కూడా లేకపోవటంతో ఏదైనా సమస్య వస్తే ఎవరి సంప్రదించాలో కూడా తెలియని పరిస్తితి నెలకొంది.

 చుక్కలు చూపుతున్న కన్సల్టెన్సీలు 

కొందరు కన్సల్టెన్సీ వ్యాపారులు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో వాహనం అమ్మిన వ్యక్తి నుంచి సేల్‌ లెటర్‌ తీసుకొని వెంటనే రిజిస్ర్టేషన్‌ మార్పించుకోవాల్సి ఉంది. కాని కన్సల్టెన్సీ యజమానులు యజమాని పేరు మార్పు చేయకపోవటంతో వాహనం విక్రయించిన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి కన్సల్టెన్సీల చుట్టూ తిరుగున్నా సరైన సమాధానం ఇవ్వకపోగా, ఏమి చేసుకుంటారో చేసుకోండంటే దౌర్జన్యంగా సమాధానం చెపుతున్నారని సమాచారం. వాహనం అమ్మిన తరువాత అది చేతులు మారి వెళ్లిన వాహనం ఏదైనా కేసులో ఇరుక్కుంటే తమకు ఇబ్బందులు తప్పవని వాహనాలు  వారు వాపోతున్నారు. కన్సల్టెన్సీలపై అధికారుల నిఘా లేకపోవటంతో ఈ రకమైన ఇబ్బందులను వాహన విక్రేతలు ఎదుర్కొంటున్నారు. కన్సల్టెన్సీల ముసుగులో కొందరు  ఫైనాన్స్‌ వ్యాపారం కూడా చేస్తున్నారు. అన్ని అనుమతులతో వ్యాపారం చేసే కన్సల్టెన్సీ యజమానులకు మార్కెట్లో జరుగుతున్న అక్రమాలు ఇబ్బందికరండా మారాయి. మొత్తంగా వాహనాల క్రయ, విక్రతల ఇబ్బందులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-29T04:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising