ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు స్థలం కేటాయింపు

ABN, First Publish Date - 2020-12-01T05:06:49+05:30

జిల్లాలో ఇసుక డిపోనకు సొంత స్థలాన్ని కేటాయించారు. త్వరలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రారంభించనున్నారు. గతంలో బైపాస్‌రోడ్‌ అనుకుని ఉన్న పోలేపల్లి గ్రామ శివారులో 2018 జనవరి31న ఇసుక డిపో ఏర్పాటు చేశారు.

నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇసుక డిపో ప్రాంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త బస్టాండ్‌ పక్కనే ఇసుక డిపో ఏర్పాటు

త్వరలో ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ అజయ్‌

ఖానాపురంహవేలి, నవంబరు 30: జిల్లాలో ఇసుక డిపోనకు సొంత స్థలాన్ని కేటాయించారు. త్వరలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రారంభించనున్నారు. గతంలో బైపాస్‌రోడ్‌ అనుకుని ఉన్న పోలేపల్లి గ్రామ శివారులో 2018 జనవరి31న ఇసుక డిపో ఏర్పాటు చేశారు. ఈఇసుక డిపో  స్థలం అద్దె ప్రాతిపదికన నడుస్తుండడంతో మైనింగ్‌, ఎండీసీ అధికారులు సొంత స్థలం కావాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ బైపాస్‌రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్‌, వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌కు పక్కనే సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని ఎండీసీకి ఇసుక డిపో కోసం అ ప్పగించారు. దీంతో ఈ ప్రాంతంలో ఎండీసీ అధికారులు కొంత స్థలాన్ని శుభ్రం చేసి కొంత ఇసుకను నిల్వ చేశారు. మిగిలిన స్థలాన్ని కూడా శుభ్రం చేసి డిసెంబరు మొదటివారంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేతులమీదుగా ప్రారంభించేం దుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. పాతఇసుక డిపో అనువైన ప్రాంతం అయినప్పటికీ అద్దె ప్రాతిపదికన నడుస్తుం డడంతో ప్రభుత్వ స్థలమైన ఎన్‌ఎస్‌పీలోకి ఇసుక డిపోను ఏర్పాటు చేస్తున్నారు. 

రెండు నెలలుగా ఇసుక డిపో మూత

వాస్తవానికి నూతన ఇసుక డిపో ప్రారంభమయ్యే వరకు పాత డిపోలో లబ్ధిదారులకు ఇసుక విక్రయాలు నిర్వహించచ్చు. కానీ అధికారులు రెండునెలలుగా ఇసుక డిపోకు తాళాలువేసి మూసివేసి ఉంచారు. దీంతో ఇసుక డిపోలో ఇసుక దొరక్కపోవడంతో సొంతిల్లు నిర్మించుకునే వినియోగదారులు ఇసుకను అధిక ధరలకు బయట వ్యాపారులు నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.   

నూతన డిపో నిర్వహణ సక్రమంగా ఉండేనా?

నూతనంగా నగరంలో నిర్మిస్తున్న ఇసుక డిపో త్వరలో ప్రారంభిస్తున్నారు. ఈ డిపో ద్వారానైనా అధికారులు సక్రమంగా విక్రయాలు నిర్వహిస్తారా లేక గతంలో మాదిరే వ్యవహరిస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నూతన డిపో వద్దకు ఇసుక దళారులు దరిచేరనీయవద్దని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. వాస్తవానికి పాత ఇసుక డిపో వద్ద దళదారులే అధికంగా ఆన్‌లైన్‌ ద్వారా కూపన్లు పొందుతున్నారు. ఇసుక విక్రయాలప్పుడు సొంతింటి నిర్మాణదారులకు సంబంధించిన ఏదైనా ఒక ఆధారం ఉంటేనే ఆన్‌లైన్‌లో కూపన్లు అందించాలని, లేనిపక్షంలో ఆపాలని పలువురు నిర్మాణదారులు కోరుతు న్నారు. వాస్తవానికి అలా విక్రయాలు సాగిస్తేనే సొంతింటి నిర్మాణదారులకు డిపో ఇసుక అందుబాటులోకి వస్తుందం టున్నారు.


Updated Date - 2020-12-01T05:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising