ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయం.. నేటి నుంచి సెలూన్‌ షాపుల బంద్‌

ABN, First Publish Date - 2020-07-06T21:36:29+05:30

కొత్తగూడెం పట్టణంలో సోమవారం నుంచి పదిరోజుల పాటు సెలూన్‌ షాపులు (మంగలిషాపులు) మూసివేస్తున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన నాయీబ్రాహ్మణ సేవా సంఘం సమావేశంలో ఈ నిర్ణయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం సంక్షేమం (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం పట్టణంలో సోమవారం నుంచి పదిరోజుల పాటు సెలూన్‌ షాపులు (మంగలిషాపులు) మూసివేస్తున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన నాయీబ్రాహ్మణ సేవా సంఘం   సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ నెల 14వరకు అన్ని హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లు, బ్యూటీ పార్లర్లు బంద్‌ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి సంఘ సభ్యుడు ఈ తీర్మాణానికి కట్టుబడి ఉండాలని కోరారు. 


ఈ నియమ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఇళ్లకు వెళ్లి కటింగ్‌లు చేసినా, షేవింగ్‌లు చేసినా వారికి రూ.2వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.  సమాచారం ఇచ్చిన వారికి రూ.500 ఇస్తామని తెలిపారు. ఈ సమావేశానికి కే. వెంకటయ్య అధ్యక్షత వహించగా, సేవా సంఘం అధ్యక్షులు ఎం.సత్యనారాయణ, కార్యదర్శి టి. సదానందం, కార్యవర్గ సభ్యులు కే. రాజు, కే. దుర్గయ్య, ఎం. వేణు, ఎ. రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T21:36:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising