ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను గోస పెడితే... మోదీ ప్రభుత్వానికి పతనం తప్పదు

ABN, First Publish Date - 2020-12-02T02:34:24+05:30

దళారులకు, కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న వ్యవసాయ, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశ రాజధాని ఢిల్లీలో దేశ రైతాంగం చేపట్టిన ఉద్యమానికి భయపడే ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్‌ సాకుతో ఢిల్లీని వదిలి పర్యటిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎ మ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు యదళ్లపల్లి సత్యం, టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు అన్నారు.

దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం, డిసెంబరు 1: దళారులకు, కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న వ్యవసాయ, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశ రాజధాని ఢిల్లీలో దేశ రైతాంగం చేపట్టిన ఉద్యమానికి భయపడే ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్‌ సాకుతో ఢిల్లీని వదిలి పర్యటిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎ మ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు యదళ్లపల్లి సత్యం, టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు, రైతు సంఘాల నాయకులపై మోదీ ప్రభుత్వ దమన కాండ ప్రయోగిస్తోం దంటూ.. మంగళశారం వామపక్షాలు, రైతు సంఘాల సమన్వ య సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ కు శవయాత్ర నిర్వహించిన అనంతరం బస్టాండ్‌ సెంటర్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.... రైతు ఉద్యమాన్ని కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని, ఉద్యమా న్ని నీరుగార్చేందుకు పోలీసులను ఉసిగొల్పి దాడులకు పూనుకుంటోందన్నారు. లాఠీఛార్జీలు, అక్రమ అరె్‌స్టలతో సమ స్యలు పరిష్కారం కావని, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎ లాంటి షరతులు విధించకుండా చర్చలకు ఆహ్వానించి బేషర తుగా రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, నాయకులు వై. శ్రీనివా సరెడ్డి, సలిగంటి శ్రీనివాస్‌, దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంక ట్‌, కంచర్ల జమలయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు అన్నవరపు సత్యనారాయణ, జాటోతు కృష్ణ, ధర్మా, బి. రమేష్‌, లక్ష్మీ, న్యూడెమోక్రసీ నాయకులు విశ్వ నాథం, జే.సీతారామయ్య, కె.సురేందర్‌, ఆర్‌.అశోక్‌, బి. రాంసిం గ్‌, కెచ్చెల రంగయ్య, ముద్ద బిక్షం, పి.సతీష్‌, ఉమర్‌, ముక్తి సత్యం, ఎన్‌.సంజీవ్‌, కిషోర్‌, టీజేఎస్‌ నాయకులు మల్లెల రామనాథం, గోపగాని శంకర్‌, ఆవు శివప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T02:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising