ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలం డీఏవోగా రాజేంద్ర కుమార్‌

ABN, First Publish Date - 2020-09-23T07:06:03+05:30

భద్రాచలం సబ్‌కలెక్టరు కార్యాలయంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసరుగా రాజేంద్రకుమార్‌ను జిల్లా కలెక్టరు ఎంవిరెడ్డి నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దారుగా శ్రీనివాస యాదవ్‌


భద్రాచలం, సెప్టెంబరు 22: భద్రాచలం సబ్‌కలెక్టరు కార్యాలయంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసరుగా రాజేంద్రకుమార్‌ను జిల్లా కలెక్టరు ఎంవిరెడ్డి నియమించారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసారు. తహసీల్దారుగా ఉన్న రాజేంద్రకుమార్‌ పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఆయనను భద్రాచలం సబ్‌కలెక్టరు కార్యాలయంలో డీఏవో పోస్టుకు బదిలీ చేసారు. కాగా ఇప్పటి వరకు డీఏవోగా బాధ్యతలు నిర్వహించిన ఎస్వీ నారాయణమూర్తి సీసీఎల్‌ఏకు సరెండర్‌ చేసారు. ఎస్వీ నారాయణమూర్తిపై పలు ఫిర్యాదులు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని చీఫ్‌ కమీషనర్‌ ఆప్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు బదిలీ చేసారు.


ఈ క్రమంలో ఆయన్ను తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఇన్‌చార్జి సబ్‌కలెక్టరును ఆదేశించారు. అలాగే భద్రాచలం మండల తహసీల్దారుగా ఎస్‌.శ్రీనివాస యాదవ్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ ఎంవిరెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. అన్నపరెడ్డిపల్లి తహసీల్దారు కార్యాలయంలో నాయబ్‌ తహసీల్దారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస యాదవ్‌ను భద్రాచలంకు బదిలీ చేస్తూ తహసీల్దారుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2020-09-23T07:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising