ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులులకు హాని కలిగిస్తే కేసులు

ABN, First Publish Date - 2020-12-04T04:54:50+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఎవరైనా పులులకు హనికలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

రామచంద్రాపురం అడవిలో పులి పాదముద్రలను సేకరిస్తున్న అటవీ అధికారులు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాడుల నివారణకు సర్పంచ్‌ అధ్యక్షతన కమిటీ

అటవీశాఖ మార్గదర్శకాలు విడుదల

అశ్వాపురం  డిసెంబరు 3: భద్రాద్రి కొటోరైటప్‌ః 3ఏఎస్‌పియం 04 త్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఎవరైనా పులులకు  హనికలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్‌.శోభ మార్గదర్శకాలను విడుదల చేయగా గురువారం ఆయా రేంజ్‌లకు  ఉత్తర్వులందినట్లు సమాచారం. జిల్లాలోని ఆళ్లపల్లి, గుండాల, కరకగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల అటవీ ప్రాతంలో పులి కదలికలను గుర్తించిన నేపథ్యంలో అటవీశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. మార్గదర్శకాల ప్రకారం పులి సంచరించే అటవీప్రాతంలో దాడుల నివారణకు స్థానిక సర్పంచ్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైనా అడవికి వెళితే కమిటీకి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. పులి సంచరించే అటవీప్రాంతాల పరిధిలో పశువుల కాపరులు వెళ్లకూడదని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే సాయంత్రం 4 గంటలలోపు తిరిగిరావాలని సూచించింది. వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు 10మంది గుంపుగా డప్పులు మోగిస్తూ, ఈలలు వేస్తూ వెళ్లాలని, పంటలకు కాపలా ఉండే రైతులు మంచెలు ఏర్పాటు చేసుకోవాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. అడవుల్లో ఎట్టి పరిస్థితుల్లో  ఉచ్చులు, విద్యుత్‌ తీగలు, వలలు ఏర్పాటు చేయవద్ధని హెచ్చరించింది. పులి అడుగు జాడలు గుర్తిస్తే స్థానిక అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 


Updated Date - 2020-12-04T04:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising