ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులి జాడ కోసం అటవీసిబ్బంది విస్తృత గాలింపు

ABN, First Publish Date - 2020-11-29T04:57:24+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పెద్దపులి జాడ కోసం అటవీ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం రామచంద్రాపురం అటవీప్రాతంలో సంచరించిన పులి శనివారం మొండికుంట పాలవాగు సమీపంలోని సీతారామా ప్రాజెక్ట్‌ కెనాల్‌పై నిర్మించిన అప్రోచ్‌ రోడ్డును దాటినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు.

సీతారామా కెనాల్‌ వద్ద పులి పాదముద్రలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

అశ్వాపురం  నవంబరు 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పెద్దపులి జాడ కోసం అటవీ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం రామచంద్రాపురం అటవీప్రాతంలో సంచరించిన పులి శనివారం మొండికుంట పాలవాగు సమీపంలోని  సీతారామా ప్రాజెక్ట్‌  కెనాల్‌పై నిర్మించిన అప్రోచ్‌ రోడ్డును  దాటినట్లు  అటవీ సిబ్బంది గుర్తించారు. అనంతరం అది తుమ్మలచెరువు గుట్టలవైపు వెళ్లినట్లు ఆనవాళ్లను  కనుగొన్నారు. కాగా తుమ్మల చెరువుకు చెందిన ఒక పశువుల కాపరికి పులి కనబడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తుమ్మలచెరువు, వెంకటాపురం, మొండికుంట, మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. కాగా అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో రెండు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

Updated Date - 2020-11-29T04:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising