ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుసంక్షేమం మరచిన ఆయిల్‌ఫెడ్‌

ABN, First Publish Date - 2020-12-12T05:04:05+05:30

రైతుసంక్షేమం మరచిన ఆయిల్‌ఫెడ్‌

ఆయిల్‌ఫెడ్‌ డివిజన్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పామాయిల్‌ రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌, వెంకటేశ్వరరావు 

అశ్వారావుపేటలో పామాయిల్‌ రైతుల ధర్నా 

పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా

అశ్వారావుపేట, డిసెంబరు 11: ఆయిల్‌పామ్‌ రైతుల సంక్షేమం పట్ల ఆయిల్‌ఫెడ్‌ అధికారులు  నిర్లక్ష్యం చేస్తున్నారని, వారి చర్యల వల్ల రైతులకు తీవ్ర ఆర్థిక  నష్టం ఏర్పడుతుందని  ఆయిల్‌పామ్‌ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆలపాటి ప్రసాద్‌, శీమకుర్తి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. శుక్రవారం అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్‌ డివిజనల్‌ కార్యాలయం ఎదుట వందలాది మంది ఆయిల్‌పాం రైతులు ధర్నా నిర్వహించారు. అధికారుల వైఖరివల్ల టన్నుకు రూ.800కుపైగా రైతులు నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించేందుకు 28 జిల్లాలకు రూ.490 కోట్లు వెచ్చించిన సీఎం కేసీఆర్‌ ఆయిల్‌ఫెడ్‌ను ప్రోత్సహిస్తున్న ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డివిజనల్‌ అధికారి బాలకృష్ణకు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. ఆయిల్‌పామ్‌ రైతులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం వ్యక్తం చేస్తూ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో పామాయిల్‌ రైతుల సమస్యలను ప్రస్తావిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, దమ్మపేట జడ్పీటీసీ సభ్యుడ పైడి వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షుడు నూతక్కి నాగేశ్వరరావు, రైతులు కాసాని వెంకటేశ్వరరావు, ఆలపాటి రామమోహనరావు, బండి పుల్లారావు, కె పుల్లయ్య, జేకెవీ రమణారావు, కేవీ సత్యనారాయణ, కొయ్యల అచుతరావు, తలసిల ప్రసాద్‌, బిర్రం వెంకటేశ్వరరావు, రేమాళ్ల కేదార్‌నాధ్‌, కృష్ణారావు, దొడ్డాకుల రాజేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising