ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయం చేయాలని వృద్ధ దంపతుల నిరసన

ABN, First Publish Date - 2020-08-09T07:47:13+05:30

తాము ఉంటున్న ఇంటిని అప్పగించాలంటూ కుమారుడుతో పాటు కొందరు వేధిస్తున్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 8: తాము ఉంటున్న ఇంటిని అప్పగించాలంటూ కుమారుడుతో పాటు కొందరు వేధిస్తున్నారని ఖమ్మం నగరానికి చెందిన వృద్ధ దంపతులు శనివారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఖమ్మం వీడివోస్‌ కాలనీకి చెందిన అంబడిపూడి రామకోటయ్య, పుష్పవతి దంపతులు వారి సొంతానికి చెందిన ఇంటిని గిఫ్ట్‌ రిజిస్ర్టేషన్‌గా తమ కూతురు గుడవర్తి భవానికి గతంలో రిజిస్ర్టేషన్‌ చేశారు. అయితే 13ఏళ్ల క్రితం వారి కుమార్తె మరణించడంతో ఆ ఇంట్లోనే తాము నివసిస్తున్నట్లు బాధితులు తెలిపారు. అయితే ఆ ఇంటిని తన పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయాలని తన కుమారుడితో పాటు మరికొంత మంది ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై నగరంలోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వాస్తవాలను పరిశీలించకుండా అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి వృద్ధులైన తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని, తమకు న్యాయం చేయాలని వారు అఽధికారులను వేడుకుంటున్నారు. ఈ విషయమై శనివారం వారు జిల్లా కలెక్టర్‌కు, సీపీకి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-08-09T07:47:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising