ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎట్‌ 9

ABN, First Publish Date - 2020-06-01T11:07:28+05:30

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 23మంది కరోనా వైరస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో తొమ్మిది మందికి పాజిటివ్‌ 

ఖమ్మం జిల్లాలో విజృంభిస్తున్న మహమ్మారి

నేలకొండపల్లిలో ఎనిమిది మందికి, మధిరలో ఒకరికి లక్షణాలు

తాజా కేసుల్లో సూర్యాపేట, హైదరాబాద్‌ లింక్‌

అజాగ్రత్తగా ఉంటే పెను ప్రమాదమే 

సామూహికంగా ప్రబలే అవకాశం


ఖమ్మం/నేలకొండపల్లి/మధిరటౌన్‌, మే 31 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 23మంది కరోనా వైరస్‌ వ్యాప్తికి గురవగా.. వారిలో తొమ్మిది మంది కోలుకున్నారు. ఒకరు మృతిచెందారు. ఈ క్రమంలోనే ఆదివారం ఒక్కరోజే మరో తొమ్మిది మందికి పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారణైంది. ఇప్పటికే నలుగురు హైదరాబాదులో చికిత్సపొందుతుండగా... ప్రస్తుతం మరో తొమ్మిది కేసులతో జిల్లాలో ఆ సంఖ్య 14కు పెరిగింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో జనసంచారం పెరిగిపోవడంతో ఎప్పుడు ఎవరి నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా నమోదైన కేసులకు జిల్లాకు సరిహద్దు ఉన్న సూర్యాపేటతోపాటు హైదరాబాదు లింకులున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సామాజిక వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందన్న భయం అందరిలోనూ కనిపిస్తోంది. 


నేలకొండపల్లిలో భయంభయం..

నేలకొండపల్లికి చెందిన ఓ ఐరన్‌షాపు యజమానికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ కావడం, అది కూడా తీవ్ర అనారోగ్యానికి గురైన తర్వాత కానీ తెలియడం, ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యులు, ఆయన షాపులో పనిచేసే వారిని క్వారంటైన్‌ చేశారు. వారికి పరీక్షలు నిర్వహించగా.. కుటుంబసభ్యుల్లో ముగ్గురు, పనిచేసేవారిలో ఐదుగురికి మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్‌ ఉన్నట్టు ఆదివారం నిర్ధారణ కావడం మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర అలజడి రేగింది. ఇంకా మరికొందరికి కూడా పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నేలకొండపల్లి వ్యాపారికి సూర్యాపేటకు చెందిన వ్యక్తుల ద్వారా వ్యాప్తి చెంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక సదరు వ్యాపారి అందరికీ తెలిసిన వ్యక్తి కావడం, వ్యాపారం కూడా భారీ స్థాయిలో ఉండటంతో మండలంలోని పలు ప్రాంతాల వారు అక్కడకి కొనుగోళ్లకు వస్తుంటారు. ఈ క్రమంలో ఎంతమంది కొనుగోళ్ల కోసం వచ్చి ఉంటాటో గుర్తించడం కష్టతరంగా మారింది. ఇక అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో నేలకొండపల్లి మండలాన్ని కట్టడిప్రాంతంగా ప్రకటిస్తున్నట్టు తహసీల్దార్‌ వీరభద్రం తెలిపారు. దుకాణ సముదాయాలు మూసి ఉంచాలని, ప్రజలు వీధుల్లోకి రావొద్దని ఆదేశాలిచ్చారు. ఇక మండల కేంద్రంలో వైద్య బృందం ఇంటింటి సర్వే చేపట్టింది. మొత్తం 225 ఇళ్లను సర్వేచేసినట్టు డాక్టర్‌ సురేష్‌నారాయణ్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి షాపులో పనిచేసే హమాలీల ఇళ్లకు హోంక్వారంటైన్‌ స్టిక్కర్లు వేశామని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలిచ్చామమన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిసున్నామని, వైద్య సేవలందించటానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా కనీసజాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 


మధిర వ్యాపారి భార్యకూ లక్షణాలు.. 

క్యాన్సర్‌తో బాధపడుతూ నెలరోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్న మధిర వ్యాపారి శుక్రవారం మృతిచెందగా.. ఆయన కుమారుడికి కూడా లక్షణాలున్నట్టు అదే రోజు రిపోర్టు వచ్చింది. ఇక ఆయన భార్యకు పాజిటివ్‌ ఉన్నట్టు ఆదివారం నిర్ధారణైంది. దీంతో మధిరలో భయాదోళనలు కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురితో మధిరలో ఎలాంటి కాంటాక్టు లేకపోయినా.. హైదరాబాద్‌లో కరోనా కాంటాక్టు అవడంతో స్థానికుల్లో అలజడి కనిపిస్తోంది. ఇక కరోనాతో మృతిచెందిన వ్యాపారి మృతదేహాన్ని మధిర తీసుకురాలేదు. హైదరాబాదులోనే అంత్యక్రియలను పూర్తిచేయగా.. బంధువులు చివరిచూపునకు నోచుకోలేకపోయారు. 


ఎవరిజాగ్రత్తలో వారుండాల్సిందే.. 

మొదటి విడతలో కరోనా జిల్లాలో కరోనా ప్రభావం కనిపించలేదు. ఢిల్లీ మర్కజ్‌యాత్రకు వెళ్లి వచ్చిన వారితో జిల్లాకు చేరుకున్న ఓ వ్యక్తి ద్వారా జిల్లాలో 8కరోనా కేసులు నమోదై అందరూ కోలుకున్నారు. ఆ తర్వాత నెలరోజుల వరకు ఎలాంటి కేసులు నమోదవలేదు. కానీ అనూహ్యంగా ఇటీవల లాక్‌డౌన్‌ సడలింపులతో మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు చేరుకున్న వలస వారిలో.. మధిరలో ఒకరికి, పెనుబల్లి మండలంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఒకరు ఇప్పటికే డిశ్చార్జ్‌ కాగా మరో ఇద్దరు హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. ఈ లోపు మళ్లీ కేసులు పెరుగుతుండటంతో జిల్లా వాసుల్లో భయం కనిపిస్తోంది. ఎప్పుడు ఎవరి ద్వారా.. ఎటు నుంచి ఈ వైరస్‌ వ్యాప్తి జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మాస్కులు ధరిస్తున్నా, శానిటైజర్లు వినియోగిస్తున్నా, భౌతిక దూరం పాటిస్తున్నా.. ఆసుపత్రులు, నిత్యావసరాలకు వెళ్లినప్పుడు ఏమైనా వ్యాపిస్తోందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యంత్రాంగం కూడా హైరానా పడుతోంది. 


ఆదివారం నమోదైన కేసులు 9

జిల్లాలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసులు 23

డిశ్చార్జి కేసులు - 9

మృతులు-1

ప్రస్తుతం యాక్టింగ్‌ కేసులు-13

Updated Date - 2020-06-01T11:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising