ఉనికి కోల్పోతున్న ‘ఎన్డీ’ దళాలు
ABN, First Publish Date - 2020-11-13T09:19:10+05:30
ప్రజాపంథాగా ఉన్న విప్లవ గ్రూపును పైలవాసుదేవరావు వర్గంగా పిలవబడి న్యూడెమ్రోసీగా పార్టీగా మారి కేంద్ర కమిటీ, రాష్ట్రంలో వ్యక్తుల పేరుతో ఎన్డీ మూడు వర్గాలుగా ముక్కలైంది. 20ఏళ్ల కిందట ఉమ్మడి ఖమ్మం, వరంగల్
ఒక దళం.. మూడు వర్గాలు
ఆంధ్రాకు తరలి వెళ్లిన మరో దళం
గుండాల, నవంబరు 12: ప్రజాపంథాగా ఉన్న విప్లవ గ్రూపును పైలవాసుదేవరావు వర్గంగా పిలవబడి న్యూడెమ్రోసీగా పార్టీగా మారి కేంద్ర కమిటీ, రాష్ట్రంలో వ్యక్తుల పేరుతో ఎన్డీ మూడు వర్గాలుగా ముక్కలైంది. 20ఏళ్ల కిందట ఉమ్మడి ఖమ్మం, వరంగల్, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయుధ దళాలు పని చేశాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సాయుధ దళాలు పని చేస్తుండగా, గతేడాది గుండాల మండలంలోని రోళ్లగడ్డ అడవుల్లో దళనేత లింగన్న పోలీసు కాల్పుల్లో మృత్యువాత పడ్డారు. అనంతరం మరో దళనేత గోపి పోలీసులకు చిక్కాడు. దాంతో ఎన్డీ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. తాజాగా మరో దళనేత యాకన్న ఇల్లెందు మండలంలోని మానిక్యారంలో పోలీసులకు పట్టుబడ్డాడు.
దాంతో ప్రస్తుతం ఎన్డీలో కేవలం రమేష్ దళం మిగిలింది. రమేష్‌ను సైతం లొంగిపోవాలని పోలీసులు అతడి కుటుంబ సభ్యులపై వత్తిడి తెస్తున్నారు. ఇల్లెందు మండలంలోని మర్రిగూడేనికి చెందిన రమేష్ పోలీసులకు తొంగిపోతే ఎన్డీ సాయుధ దళాలు ఇక లేనట్లే. ఎన్డీ పార్టీలో రాయలవర్గం, పెద్దచంద్రన్న వర్గంగా చీలికలు రాగా, రాయలవర్గం మళ్లీ రెండు వర్గాలు చేలిపోయింది. ఎన్డీలో పార్టీ బహిష్కరణల పరంపరం కొనసాగుతుండడంతో, రెండు వర్గాల మధ్య పచ్ఛన్నయుద్ధం సాగుతోంది. బయ్యారం మండలంలో దళనేతగా పని చేస్తున్న దళనేత ఇక్కడి నేతల తీరు నచ్చక, ఆంధ్రాకు వెళ్లినట్లు సమాచారం.
ఈ నేపధ్యంలోనే పెద్దచంద్రన్న గుంటూరులో పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. గుంటురూలోని రహస్య ప్రదేశంలో సమావేశం నిర్వహించాల్సి ఉండగా దానికంటే ముందుగానే పోలీసులు పెద్దచంద్రన్నను అరెస్టు చేయడంతో పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఎన్డీ దళాలు లేకుండా చేయాలనే పోలీసుల లక్ష్యం సఫలం కావడంతో జిల్లా పోలీసు అధికారులు స్ధానిక పోలీసుల అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీ దళాలు లేకుండా చేస్తే మావోయిస్టుల దళాల సంచారంపై సులభంగా సమాచారం అందుతుందని పోలీసులు భావిసున్నారు. ప్రస్తుతం ఎన్డీ దళాల ఉనికి కనుమరుగైందనడంలో సందేహం లేదు.
Updated Date - 2020-11-13T09:19:10+05:30 IST