ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నామ వరలక్ష్మికి కన్నీటి వీడ్కోలు

ABN, First Publish Date - 2020-10-03T11:22:39+05:30

టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాతృమూర్తి నామ వరలక్ష్మి(91)కి కుటుంబసభ్యులు, ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొరివిపెట్టిన చిన్నకుమారుడు

నివాళులర్పించిన పలువురు ప్రముఖులు


ఖమ్మం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాతృమూర్తి నామ వరలక్ష్మి(91)కి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇటీవల బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఆమె తుదిశ్వాస విడవగా.. శుక్రవారం ఆమె భౌతికకాయానికి ఖమ్మంరూరల్‌ మండలంలోని గొల్లగూడెంలోని మధుకాన్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఆవరణలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఖమ్మం నెహ్రూనగర్‌లోని నివాసం వద్ద వరలక్ష్మి భౌతిక కాయానికి రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, సత్తుపలి,్ల వైరా, ఇల్లెందు, అశ్వారావుపేట, శేరిలింగంపల్లి, మిర్యాలగూడెం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్‌, బానోతు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కరరావు, ఖమ్మం జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌తోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ, ఎన్డీ, సీపీఐ, సీపీఎం పక్షాల నేతలు, వ్యాపార రంగ ప్రముఖులు నివాళులర్పించారు.


అనంతరం పూలతో అలంకరించిన వాహనంలో వరలక్ష్మి భౌతికకాయాన్ని ఉంచి అంతిమయాత్రను నిర్వహించారు. కుమారులు నామ నాగేశ్వరరావు, రామారావు, సీతయ్య కృష్ణయ్యతోపాటు కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. వరలక్ష్మికి చిన్నకుమారుడు క్రిష్ణయ్య అంతిమసంస్కారాలు నిర్వహించారు.

Updated Date - 2020-10-03T11:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising