ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇల్లెందు ఎమ్మెల్యే ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-12-06T03:50:47+05:30

తన విధుల్లో షిప్టు మార్చాలని కోరుతూ ఓ వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టేకులపల్లి, డిసెంబరు 5: తన విధుల్లో షిప్టు మార్చాలని కోరుతూ ఓ వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. టేకులపల్లి ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ కథనం ప్రకారం ఇల్లెందు మండలంలోని దాసుతండాకు చెందిన బానోతు రామా, ఆయన కుమారుడు రాజేష్‌ ఇద్దరూ కోయగూడెం ఓసీలో ఓబీ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. రామా వోల్వో డ్రైవర్‌గా, ఆయన కుమారుడు రాజేష్‌ సూపర్‌వైజరుగా పనిచేస్తున్నారు. కాగ తండ్రి కొడుకులు ఒకే షిప్టులో విధులు నిర్వహిస్తుండగా తమ విధులు వేర్వేరుగా నిర్వహించేందుకు షిప్టులు మార్చాలని ఎమ్మెల్యే హరిప్రియను, ఆమె భర్త హరిసింగ్‌ను రామా గతంలో కోరాడు. మండలంలోని టేకులపల్లిలో ఎమ్మెల్యే ఇంటి పక్క ఇంట్లోనే ఉంటున్న రామా శనివారం ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడు. ఓసీలో షిప్టు మార్చాలని ఎమ్మెల్యే భర్త సోదరుడు పుల్‌సింగ్‌ను కోరాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అందుబాటులో లేరని వచ్చిన తర్వాత విషయం ఆమె దృష్టితీసుకెళదామన్నాడు. దీంతో ఎమెల్యే తన షిప్టు మార్చడంలో సహకరించడంలేదని నిరసిస్తూ తన వెంటతెచ్చుకొన్న కత్తితో ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోనే మద్యం మత్తులో ఉన్న రామా తన గొంతును కోసుకొన్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే హరిప్రియ తోటికోడలు కత్తిని లాక్కొవడంతో పెద్ద ప్రమాధం తప్పింది. వెంటనే 108 వాహనం ద్వారా రామాను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. టేకులపల్లి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపారు. 


Updated Date - 2020-12-06T03:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising