నిరుపేదలకు వరం కల్యాణ లక్ష్మి పథకం
ABN, First Publish Date - 2020-12-02T02:42:57+05:30
నిరుపేద లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, డిసెంబరు 1: నిరుపేద లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి బిడ్డ ఒడు పుగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళ కళ్లల్లో ఆనందం చూడటమే ఈ పథకం ము ఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. పెళ్లింట సంతోష వాతా వరణం ఉండాలనే సంకల్పంతో ఈ పథకం నుంచే నగదు ను అమ్మాయి కుటుంబానికి బహుమతిగా అందిస్తున్నా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని 74 మంది కళ్యా ణ లక్ష్మీ లబ్ధిదారులకు సుమారు రూ.75లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ, తహసీల్దార్లు రవి కుమార్, నాగ రాజు, భద్రకాళి, ఎంపీపీలు భూక్యా సోనా, బాదావత్ శాం తి, విజయలక్ష్మీ, మునిసిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పం చ్‌లు, కో-ఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, అధికారులు, కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
కొత్తగూడెం పట్టణంలో క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో గత నెలలో 15 టీమ్ లను సిద్ధంచేసి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థలాలను సర్వేచేసేలా ప్రతిపాదించిన కూడా పట్టాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధికారులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కొత్తగూడెం తహసీల్దార్ రవి కుమార్‌ను నిలదీశారు. విధుల్లో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు వన మా అంటే నమ్మకమని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాలన్నారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న క్రమబద్ధీకరణ పట్టాల సర్వేలను పూర్తిచేసి యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
Updated Date - 2020-12-02T02:42:57+05:30 IST