ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తబిచ్చగాళ్లు వచ్చారు జాగ్రత్త

ABN, First Publish Date - 2020-12-31T05:12:16+05:30

‘ఖమ్మానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారు జాగ్రత్త. గత ఎన్నికల్లో 2వేల ఓట్లు కూడా రాని వారు.. మాది జాతీయ పార్టీ అంటూ జబ్బలు చరుస్తున్నారు.

సభలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గత ఎన్నికల్లో 2వేల ఓట్లు కూడా రానివారు జబ్బలు చరుస్తున్నారు

 ఎంతమందితో కలిసినా వారికి శంకరగిరి మాన్యాలే..

 బీజేపీపై మంత్రి పువ్వాడ పరోక్ష వ్యాఖ్యలు

 ఖమ్మంలో అబ్దుల్‌కలాం విగ్రహావిష్కరణ 

ఖమ్మం కార్పోరేషన్‌, డిసెంబరు 30: ‘ఖమ్మానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారు జాగ్రత్త. గత ఎన్నికల్లో 2వేల ఓట్లు కూడా రాని వారు.. మాది జాతీయ పార్టీ అంటూ జబ్బలు చరుస్తున్నారు. ఎంతమందితో కలిసి వచ్చినా వారికి శంకరగిరి మాన్యాలే’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బీజేపీ, ఆపార్టీ నాయకులను ఉద్దేశించి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరం లోని ముస్తఫానగర్‌ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన అబ్దుల్‌కలాం కాంస్యవిగ్రహాన్ని బుధవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఉద్వే  గంగా మాట్లాడిన మంత్రి.. ముస్తాఫానగర్‌ సెంటర్‌ను అబ్దుల్‌కలాంకూడలిగా పేరు మార్చనున్నామని, వచ్చే కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై తీర్మానం చేయాలని మేయర్‌ పాపాలాల్‌ను కోరారు. ఖమ్మం ఎల్లలు గురించి అవగాహ నేలేని కొత్త బిచ్చగాళ్లు జబ్బలు చరుస్తున్నారని, వారికి అస లు ఒన్‌టౌన్‌. టుటౌన్‌, త్రీటౌన్‌ ప్రాంతాల గురించి తెలు సా అని, అక్కడి రోడ్లు, సమస్యలపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. 2018లో తనపై పోటీచేసిన ఆ జాతీయ పార్టీకి 2వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు వారు జబ్బలు చరుచుకోవటం సిగ్గుచేటన్నారు. వారు ఎంతమందితో కలిసి వచ్చినా శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదన్నారు. అటువంటి బఫూన్లను ఖమ్మం ప్రజలు నమ్మరని, ఒక్క టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌, కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ను మాత్రమే నమ్ముతారని పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చిన తరువాతే ఖమ్మం అభివృద్ధి జరిగిందని, గత పాలకు ల హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనించాలన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తనను ఖమ్మం ప్రజలు ఆశీర్వదించారని, తాను టీఆర్‌ఎస్‌లో ఉండటం వల్లే అభివృద్ధి చేయగలిగానని పేర్కొన్నారు. యువనేత కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌ను అడిగిందే తడవుగా ఖమ్మం అభివృద్ధికి రూ.వందల కోట్లు కేటాయించారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఇళ్లకు వెళ్లి లబ్దిదారులకు అందచేశామని, ఏ ఆడపడుచు తాగునీళ్లకో సం రోడ్డెక్కే పరిస్థితి లేకుండా చేశామన్నారు. వచ్చే మూడేళ్లలో స్థలం ఉన్న ప్రతి పేదకు ఇల్లు నిర్మించుకు నేందుకు ప్రభుత్వం రూ.3లక్షలు ఇవ్వనుందని పువ్వాడ పేర్కొన్నారు. ఐటీ హబ్‌ ద్వారా విదేశాల నుంచి ఐటీ కంపెనీలను నగరానికి తెచ్చామన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ గుండాల కృష్ణ, మేయర్‌ పాపాలాల్‌, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, మైనారిటీ సెల్‌ జిల్లా అద్యక్షుడు తాజుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T05:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising