ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యసేవలు శభాష్‌

ABN, First Publish Date - 2020-10-21T06:13:22+05:30

కరోనా సోకిన మహిళకు పురుడుపోసి తల్లి, బిడ్డను క్షేమంగా ఉండేలా వైద్యసేవలు అందించిన కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి వైద్య బృందానికి హ్యాట్సాప్‌ చెప్పారు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి. మంగళవారం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మహిళకు పురుడుపోసిన డాక్టర్లు

అభినందించిన భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి


కొత్తగూడెం కలెక్టరేట్‌, అక్టోబరు 20: కరోనా సోకిన మహిళకు పురుడుపోసి తల్లి, బిడ్డను క్షేమంగా ఉండేలా వైద్యసేవలు అందించిన కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి వైద్య బృందానికి హ్యాట్సాప్‌ చెప్పారు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి. మంగళవారం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో పినపాక మండలం జానంపేట గ్రామం మేడ్వాయి కాలనీకి చెందిన గర్భిణికి డాక్టర్‌ సరళ నేతృత్వంలో శస్త్రచికిత్స చేసి పురుడుపోశారు. ఈనెల 19వతేదీ రాత్రి 11.45 గంటలకు పురిటి నొప్పులతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి ఆ మహిళ వచ్చారు.  కాన్పుకు ముందు వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కొవిడ్‌ సోకిందని తెలిసింది. అయినా వైద్యులు ఎంతో ధైర్యంగా ఆమెకు  శస్త్రచికిత్స నిర్వహించి తల్లీ, బిడ్డను కాపాడారు. దీంతో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి డాక్టర్‌ సరళతోపాటు వైద్య బృందాన్ని అభినందించారు. అత్యవసర స్థితిలో మహిళకు, తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికి కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ వైద్యసేవలు అందించడం హర్షనీయం అన్నారు.  

Updated Date - 2020-10-21T06:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising