ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2020-07-01T10:41:48+05:30

పారిశుధ్యం విషయంలో అలసత్వం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి

కలెక్టర్‌ కర్ణన్‌

ఏన్కూరులో ఆకస్మిక తనిఖీ


ఏన్కూరు, జూన్‌ 30: పారిశుధ్యం విషయంలో అలసత్వం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ అన్నారు. మంగళవారం మండలంలోని నాచారం, రేపల్లెవాడ గ్రామాల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. రేపల్లెవాడలోని ఓ ఇంటిలో కూలర్లలో దోమలు ఉండడాన్ని చూసి అక్కడ వార్డు సభ్యుడికి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. డ్రైడే కార్యక్రమంలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్ర గురించి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించాలన్నారు.


హరితహారంలో నాటిన మొక్కలకు నీటి వసతి కలిపించి సంరక్షణా బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఒక్క డెంగీ కేసు కూడా నమోదుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కలిగినవారు స్వచ్ఛంధంగా ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు చేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, అన్నారు. గ్రామాల్లో మిషన్‌భగీరధ నీటి సరఫరాపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో అశోక్‌, ఈవోఆర్‌డీ వీరస్వామి, సర్పంచ్‌లు విజయకుమారి, రాంబాబు, పంచాయతీ కార్యదర్శి స్నేహలత, పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T10:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising