ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో వ్యక్తి మృతి.. కరోనా మరణమని ప్రచారం.. చివరకు..

ABN, First Publish Date - 2020-08-10T16:09:25+05:30

కరోనా భయం మనుషుల మధ్య దూరాన్ని పెంచడమే కాదు.. మానవత్వాన్ని కూడా మరిచిపోయేలా చేస్తోంది. గుండెపోటుతో చనిపోయిన ఓ రైతుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకురాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భయంతో అంత్యక్రియలకు రాని గ్రామస్థులు

తానున్నానంటూ ముందుకొచ్చిన యువరైతు


పాల్వంచ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): కరోనా భయం మనుషుల మధ్య దూరాన్ని పెంచడమే కాదు.. మానవత్వాన్ని కూడా మరిచిపోయేలా చేస్తోంది. గుండెపోటుతో చనిపోయిన ఓ రైతుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకురాలేదు. పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన మల్లాది వెంకయ్య(50) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. ఆదివారం ఉదయం అతడి మృతి వార్త గ్రామంలో అందరికీ తెలిసింది, అదికాస్తా కరోనా మృతిగా ప్రచారం జరిగింది. భయంతో అంత్యక్రియలకు గ్రామస్థులు, బంధువులు ఎవరూ రాలేదు. 


చివరికి గ్రామపంచాయతీ వారిని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువరైతు రంజిత్‌కుమార్‌ తన సొంత ట్రాక్టర్‌పై మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో పాల్వంచ మునిసిపల్‌ కమిషనర్‌కూడా స్పందించి ముగ్గురు పురపాలక సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చి వెంకయ్య అంత్యక్రియలకు పంపారు. వారంతా కలిసి కుటుంబ సభ్యులతో అంత్యక్రియలను పూర్తిచేయించారు. దీంతో యువరైతు రంజిత్‌, మునిసిపల్‌ కమిషనర్‌ను వెంకయ్య కుటుంబసభ్యులు, బంధువులు అభినందించారు. ఇప్పటికైనా సాధారణ మరణాలను కూడా కరోనా మరణాలుగా చిత్రీకరించి మానవత్వం లేని పనులకు పాల్పడవద్దని యువరైతు రంజిత్‌ కుమార్‌ కోరారు.

Updated Date - 2020-08-10T16:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising