ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీపీఎస్‌కు కేటీపీపీ బేరింగ్‌

ABN, First Publish Date - 2020-09-29T06:21:40+05:30

పాల్వంచలోని కేటీపీఎస్‌ ఐదో దశలోని తొమ్మిదో యూనిట్‌ టర్బైన్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య ఎన్ని విధాలుగా ప్రయత్నిచినా పరిష్కారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొమ్మిదో యూనిట్‌లో ఆగని ప్రకంపనలు


పాల్వంచ, సెప్టెంబర్‌ 28: పాల్వంచలోని కేటీపీఎస్‌ ఐదో దశలోని తొమ్మిదో యూనిట్‌ టర్బైన్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య ఎన్ని విధాలుగా ప్రయత్నిచినా పరిష్కారం కావడంలేదు. బీహెచ్‌ఈఎల్‌ నిపుణులు బేరింగ్‌ను తొలగించి మరమ్మతులు చేపట్టినా పలితం లేకపోవటంతో భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్‌ పవర్‌స్టేషన్‌ నుంచి బేరింగ్‌ను తెప్పిస్తున్నారు. ఇది మంగళవారం కేటీపీఎస్‌కు చేరుకుంటుంది. దీన్ని అమర్చితే ప్రకంపనల సమస్య పరిష్కారం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు.


ఈ యూనిట్‌ క్యాపిటల్‌ ఓవర్‌హాల్‌ పనులు చేపట్టిన రెండు నెలలు యూనిట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోగా, వర్షాల కారణంగా మరోవారం రోజులు యూనిట్‌ను నిలిపేశారు. మళ్లీ తాజాగా ఉత్పత్తి పునరుద్దరించగానే ప్రకంపనలు మళ్లీ మొదలవ్వడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టర్బైన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయని చీఫ్‌ ఇంజనీర్‌ రవీందర్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా  మరమ్మతులు పూర్తిచేస్తామని వివరించారు.  

Updated Date - 2020-09-29T06:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising