ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తమ సేవలకు ‘కాయకల్ప’ అవార్డు

ABN, First Publish Date - 2020-09-26T11:16:36+05:30

మండలంలో ప్రజలకు ఉత్తమ సేవలు, పచ్చదనం, పారిశుధ్య మెరుగుదల చూపించినందుకు ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోనకల్‌ పీహెచ్‌సీ అవార్డు కైవసం..

అంకితభావంతో వైద్యాధికారి సేవలు


బోనకల్‌, సెప్టెంబరు 25: మండలంలో ప్రజలకు ఉత్తమ సేవలు, పచ్చదనం, పారిశుధ్య మెరుగుదల చూపించినందుకు ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసింది.  ఆసుపత్రి ముందు బాగంలో లాన్‌తో పాటు పలు రకాల మొక్కలు వేశారు. ఆసుపత్రి ఆవరణ ఆహ్లాదకరంగా కనిపించేలా పారిశుద్య పనులు, గోడల పై ప్రభుత్వ వైద్య సేవలకు సంబందించి చిత్రాలు, ఆకర్షణీయంగా కనిపించే విదంగా రంగులు వేయించారు.


ఆరు పడకల ఆసుపత్రి కాగా ఆవసరాన్ని బట్టి జ్వరాల సీజన్‌లో 50 పడకలను అదనంగా వేయించి వైద్య సేవలు అందించారు. రెండు సంవత్సరాల కాలంలో 64 డెలివరీలు చేశారు. 2019- 2020 ఏడాదికి కాయకల్ప అవార్డును కైవసం చేసుకుంది. 


డీఎండ్‌హెచ్‌వో సహకారంతో పీహెచ్‌సీ అభివృద్ధి

 తాటికొండ శ్రీకాంత్‌, వైద్యాధికారి

డీఎండ్‌హెచ్‌వో మాలతి ఇచ్చిన సహకారంతో పీహెచ్‌సీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాం. మండల ప్రజలు, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు. కాయకల్ప అవార్డు తీసుకోవడంతో మాపై మరింత బాద్యత పెరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించి మండలానికి మంచి పేరు తీసుకొచ్చేలా కృషి చేస్తాను.

Updated Date - 2020-09-26T11:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising