ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడపిల్లలకు అండగా కల్యాణలక్ష్మి

ABN, First Publish Date - 2020-08-05T09:37:31+05:30

పేదింటి ఆడపిల్లలకు, వారి కుటుంబానికి అండగా ఉండేలా సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని రవాణాశాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాదర్శకంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే

ఖమ్మం నియోజకవర్గంలో రూ.23కోట్ల ఆర్థికసాయం 

తాజాగా రూ.2.46కోట్ల చెక్కులు అందజేత 

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 


ఖమ్మం కార్పొరేషన్‌, ఆగస్టు 4: పేదింటి ఆడపిల్లలకు, వారి కుటుంబానికి అండగా ఉండేలా సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో  248 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.2.46కోట్ల కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నియోజక వర్గంలో ఇప్పటివరకు ఈ కల్యాణలక్ష్మి పథకం ద్వారా 3,500 మందికి రూ.23కోట్లు ఆర్థిక సాయం అందించామని వివరించారు. పేదలకు కూతుళ్ల వివాహం భారం కాకూడదన్న వినూత్న ఆలోచన మేరకు సీఎం కేసీఆర్‌ ఆడపిల్ల వివాహానికి ఆర్థికసాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తొలుత రూ.75వేలు ఉన్న సాయాన్ని రూ.లక్షకు పెంచారన్నారు. ఈ పథకాల అమల్లో మధ్య దళారుల ప్రమేయం లేకుండా పారద్శకంగా అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు.


శానససభ్యుల ఆమోదంతో మంజూరైన చెక్కులను స్వయంగా శాసనసభ్యులే లబ్ధిదారులకు అందించే అవకాశాన్ని సీఎం కల్పించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఇతర వ్యయాలు తగ్గించి, సంక్షేమపథకాలను కొనసాగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు ఎల్‌.రాములునాయక్‌, సండ్ర వెంకటవీరయ్య, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ జి.పాపాలాల్‌, ‘సుడా’ చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఆర్డీవో రవీంద్రనాథ్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T09:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising