ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవేం ని‘బంధనాలు’ ?

ABN, First Publish Date - 2020-12-06T04:45:51+05:30

దశాబ్ధాలుగా భద్రాద్రిలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ముక్కోటి ఏకదాశి ఉత్సవాలను ఈసారి కరోనా కారణంగా ఆంక్షల నడుమ నిర్వహించాలని నిర్ణయించడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సభలకు, రోడ్డుషోలకూ అడ్డురాని కరోనా ఆంక్షలు ప్రశాంతంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎలా అడ్డొస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి ముక్కోటి ఉత్సవాలపై కొవిడ్‌ ఆంక్షలు

నీటిదొనెలో తెప్పోత్సవంపై భక్తుల అభ్యంతరం 

రాజకీయ సభలకు లేని ఆంక్షలు ఆధ్యాత్మిక సేవలకేంటని ప్రశ్న

నిబంధనలపై పునరాలోచించాలని వినతి


భద్రాచలం, నవంబరు 28: దశాబ్ధాలుగా భద్రాద్రిలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే ముక్కోటి ఏకదాశి ఉత్సవాలను ఈసారి కరోనా కారణంగా ఆంక్షల నడుమ నిర్వహించాలని నిర్ణయించడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సభలకు, రోడ్డుషోలకూ అడ్డురాని కరోనా ఆంక్షలు ప్రశాంతంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎలా అడ్డొస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏటా గోదావరిలో నిర్వహించే తెప్పోత్సవాన్ని ఈసారి రామాలయ ప్రాంగణంలోని యాగశాలలో నీటిదోనెలో నిర్వహిస్తామనడం ఎంత వరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల క్రితం తుఫాను కారణంగా  తెప్పోత్సవం నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయించడంతో ఆనాడు గోదావరిలోనే రజత సింహాసనంపై శ్రీ సీతారామచంద్రస్వామిని ఆసీనులను చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వీఐపీలు, భక్తుల దర్శనం అనంతరం తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. అప్పుడు అలా నిర్వహించిన అధికారులు ఈసారి మాత్రం ఎన్నడూ లేని విధంగా నీటిదోనెలో గద్దెపై సింహాసనం ఏర్పాటు చేసి స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహిస్తామనడం పట్ల భక్తులు కలత చెందుతున్నారు. నదులు లేనిచోట సాధారణంగా ఈశాన్యంలో తటాకాలు, బోర్లు తదితర వాటిని ఏర్పాటు చేస్తుంటారని, కానీ భద్రాద్రిలో రామయ్య తెప్పోత్సవానికి నైరుతిలో నీటిదోనె ఏర్పాటు చేయడం భావ్యం కాదని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై అధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతులను ఇస్తూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు కొవిడ్‌ పేరుతో ఆంక్షలు విధించడం ఎంత మాత్రం భావ్యం కాదని వారు పేర్కొంటున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ముక్కోటి అనంతరం నిర్వహించే రాపత్తు సేవలు చిత్రకూట మండపంలోనే నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. 


రాజకీయ సభలకు లేని ఆంక్షలు ఆధ్యాత్మిక సేవలకా ?


ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినా వాటికి ఎలాంటి ఆంక్షలు విధించలేదని, కానీ ప్రశాంతంగా జరిగే ఆధ్యాత్మిక సేవలకు మాత్రం కరోనా పేరుతో ఆంక్షలు వర్తింపజేయడం ఎంత వరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కరోనా పేరుతో తెప్పోత్సవం యాగశాలలో నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. గోదావరి నదీ తీరంలో సాగే తెప్పోత్సవాన్ని కరకట్టపై కూర్చొని భక్తులు తిలకించవచ్చని ఈ సమయంలో సామాజిక దూరం, మాస్కులు  ధారణ, శానిటైజేషన్‌ అమలు చేస్తే సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ సభలకు, సమావేశాలకు, ర్యాలీలకు లేని ఆంక్షలు భద్రాద్రి రామయ్యకు నిర్వహించే ఉత్సవాలకు విధించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ క్రమంలో ఇటీవల ఏపీలోని విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించిన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముక్కోటి ఉత్సవాల నిర్వహణపై అధికారులు మరోసారి ఆలోచన చేసి కార్యక్రమాలను భక్తులు వీక్షించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 


Updated Date - 2020-12-06T04:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising