ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలం సాగుపై అన్నదాతల ఆసక్తి

ABN, First Publish Date - 2020-07-04T10:18:20+05:30

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ను కోల్పోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది వైరా ఆయకట్టు రైతులు వానాకాలంలో వరిపంట సాగుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా ఆయకట్టు వరినారుమళ్లకు నీటి విడుదలపై నేడు సమావేశం


వైరా, జూలై 3: గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ను కోల్పోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది వైరా ఆయకట్టు రైతులు వానాకాలంలో వరిపంట సాగుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరినారుమళ్లు పోసుకునేందుకు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలపై స్పష్టత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ చొరవ తీసుకొని శనివారం ఉదయం పది గంటలకు క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల, వ్యవసాయశాఖ అధికారులు, మండలంలోని ప్రజాప్రతినిధులు, రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


ఈ సమావేశంలో వరినారుమళ్లకు రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల ఆతర్వాత రిజర్వాయర్‌లో నీటి లభ్యత, నాట్లకు నీరు విడుదల తదితర అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గత ఏడాది ఈ సమయానికి రిజర్వాయర్‌లో 8.6అడుగుల నీటిమ ట్టం మాత్రమే ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 14.6 అడుగులుగా ఉంది. నారుమళ్లకు నీరు విడుదల చేస్తే కనీసం రెండు అడుగుల నీటిమట్టం తగ్గిపోతుంది. గతంలో మాదిరిగానే జూలై చివ రి నుంచి నిరంతరంగా వర్షాలు కురిస్తే రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండటమేకాకుండా రైతు లు నాట్లు వేసుకొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షాలు కురవకపోతే రైతులు పోసుకున్న వరినారుమళ్లు మాత్రం నష్టపోయేందుకు రైతులు సిద్ధంగా ఉండాలని రైతులు అంటున్నారు. అలా కాకుండా తమను అభాసుపాల్జేస్తే ఇబ్బందిపడతామని అధికారులు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2020-07-04T10:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising